Homeబిజినెస్New Income Tax Bill 2025: ఎన్ఆర్ఐ హోదాతో ఇక తప్పించుకోలేరు.. రూ.15లక్షలు దాటితే ట్యాక్స్...

New Income Tax Bill 2025: ఎన్ఆర్ఐ హోదాతో ఇక తప్పించుకోలేరు.. రూ.15లక్షలు దాటితే ట్యాక్స్ కట్టాల్సిందే

New Income Tax Bill 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 న్యూ ఇన్‌కమ్ టాక్స్ బిల్‌ను ఈ రోజు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇది ఆరు దశాబ్దాల పాత 1961 నాటి ఆదాయపన్ను చట్టానికి బదులుగా రాబోతుంది. ఈ కొత్త చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. న్యూ ఇన్‌కమ్ టాక్స్ బిల్‌లో మొత్తం 536 సెక్షన్లు, 23 అధ్యాయాలు, 16 షెడ్యూల్స్ ఉన్నాయి, ఇవన్నీ కేవలం 622 పేజీలలో సమర్పించబడ్డాయి. కాగా, పాత చట్టంలో 298 సెక్షన్లు, 14 షెడ్యూల్స్ ఉండగా, మొత్తం 823 పేజీలు ఉన్నాయి. ఈ కొత్త చట్టం ప్రధానంగా సేలరీ సెక్షన్‌లో టాక్సబుల్ ఇన్‌కమ్ నిర్వచనాన్ని సులభతరం చేయాలని లక్ష్యంగా రూపొందించారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన కొత్త ఆదాయపు పన్ను బిల్లు పన్ను నివాస(tax residency) ప్రమాణాలను పునర్నిర్వచిస్తుంది. ఇది ప్రవాస భారతీయులపై (NRI) పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా భారతదేశంలో రూ. 15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ సంపాదించి పన్నులు చెల్లించని వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ఈ కొత్త నియమం ప్రకారం.. స్వదేశంలో ఉంటూ 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు భారత పౌరులుగా పరిగణించబడతారు. భారతదేశంలో సంపాదించే ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త చర్య తీసుకోవడం వెనుక ఉద్దేశ్యం NRI హోదా దుర్వినియోగం, పన్ను ఎగవేతను నిరోధించడం. ఈ బిల్లు ప్రకారం.. ఒక వ్యక్తి ఒక పన్ను సంవత్సరంలో కనీసం 182 రోజులు భారతదేశంలో గడిపినా లేదా 60 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం భారతదేశంలో గడిపినా లేదా నాలుగు సంవత్సరాలలో మొత్తం 365 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం భారతదేశంలో గడిపినా అతను ఇక్కడి పౌరుడిగా పరిగణించబడతారు. అతని ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు.

అయితే ఒక వ్యక్తి భారతీయ విమానయాన సంస్థ లేదా ఓడలో సిబ్బందిగా భారతదేశం నుండి బయలుదేరినా లేదా ఉద్యోగం కోసం విదేశాలకు వెళితే అతను 60 రోజుల నియమం కింద అతడిని కవర్ చేయరు. భారతదేశానికి వచ్చే ఎన్నారైలకు కూడా ఈ షరతు నుండి మినహాయింపు ఉంటుంది. భారతదేశానికి వచ్చే వ్యక్తి రూ. 15 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తే (విదేశీ వనరుల నుండి వచ్చే ఆదాయం మినహా), 60 రోజుల నియమాన్ని 120 రోజులకు పెంచుతారు. భారతదేశ పన్ను వ్యవస్థ పౌరసత్వం కంటే దేశంలో ఒక వ్యక్తి ఉనికిపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం, NRIలు భారతదేశంలో సంపాదించే ఆదాయంపై మాత్రమే పన్ను విధించబడుతుంది. అయితే దేశం వెలుపల వారు సంపాదించే ఆదాయం పన్ను రహితంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా చాలా మంది భారతదేశంలో ఉంటూ డబ్బు సంపాదిస్తూనే, పన్నులను ఎగవేసేందుకు NRI హోదాను ఉపయోగించుకుంటున్నారు.కొత్త నియమం పన్ను ఎగవేతను నిరోధిస్తుంది. విదేశాల నుంచి వచ్చి రూ15లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తూ పన్ను ఎగ్గొట్టే వారు ఇక కొత్త బిల్లు కింద తప్పించుకోలేరు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper
Exit mobile version