Pengba Fish: పెంగ్బా చేపల పెంపకంతో లక్షల్లో సంపాదించవచ్చు.. ఎలా అంటే?

Pengba Fish: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందాలని భావించే వాళ్లు వ్యాపారాలపై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు. చేపల పెంపకం ద్వారా సులువుగా లక్షల్లో సంపాదించే అవకాశం ఉంటుంది. సంవత్సరానికి కేవలం 25,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సులభంగా నెలకు లక్షల రూపాయలు సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. అయితే సాధారణ చేపలతో పోలిస్తే పెంగ్బా చేపల పెంపకం ద్వారా సులువుగా డబ్బు సంపాదించవచ్చు. మన దేశంలో చాలామంది చేపలను పెంచడం ద్వారా జీవనం […]

Written By: Kusuma Aggunna, Updated On : October 11, 2021 2:54 pm
Follow us on

Pengba Fish: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందాలని భావించే వాళ్లు వ్యాపారాలపై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు. చేపల పెంపకం ద్వారా సులువుగా లక్షల్లో సంపాదించే అవకాశం ఉంటుంది. సంవత్సరానికి కేవలం 25,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సులభంగా నెలకు లక్షల రూపాయలు సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. అయితే సాధారణ చేపలతో పోలిస్తే పెంగ్బా చేపల పెంపకం ద్వారా సులువుగా డబ్బు సంపాదించవచ్చు.

మన దేశంలో చాలామంది చేపలను పెంచడం ద్వారా జీవనం సాగిస్తున్నారు. వేర్వేరు రకాల చేపల పెంపకం వల్ల సులభంగా డబ్బు సంపాదించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఒకప్పుడు రాజులు, చక్రవర్తులు పెంగ్బా చేపలను తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. ప్రస్తుతం చాలామంది పెంగ్బా చేపలను పెంచడం ద్వారా జీవనం సాగిస్తూ ఉండటం గమనార్హం. మణిపూర్ కు చెందిన సాయిబామ్ సుర్చంద్ర 45 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ చేపలను ఉత్పత్తి చేస్తున్నాడు.

ఈ చేపల పెంపకం ద్వారా అతనికి 40 లక్షల రూపాయల నుంచి 45 లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తోందని తెలుస్తోంది. ఆధునిక సాంకేతికత ద్వారా చేపల పెంపకంతో సులువుగా డబ్బులు సంపాదించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. బయోఫ్లాక్ టెక్నిక్ ఫిషరీస్ ద్వారా సులువుగా లక్షల్లో సంపాదించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. 15,000 లీటర్ల ట్యాంకులలో బయోఫ్లోక్స్ అనే బ్యాక్టీరియాను వినియోగించి చేపల రెట్టలను ప్రోటీన్లుగా మార్చవచ్చు.

నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లెక్కల ప్రకారం 7 ట్యాంకులతో బిజినెస్ ను మొదలుపెట్టాలని భావిస్తే 7.5 లక్షల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాపారం ద్వారా నెలకు కనీసం 2 లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్ ఉంటుంది.

Tags