Paytm: ప్రముఖ యూపీఐ పేమెంట్ సంస్థలలో ఒకటైన పేటీఎం కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో ఆఫర్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. గూగుల్ పే, ఫోన్ పే తర్వాత ఎక్కువ సంఖ్యలో ప్రజలు పేటీఎంను ఉపయోగిస్తున్నారు. రూపాయి నుంచి లక్షల రూపాయల వరకు వేగంగా బదిలీ చేసే అవకాశం ఉండటంతో పేటీఎం యాప్ వినియోగం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. అయితే తాజాగా పేటీఎం సూపర్ ఆఫర్ ను ప్రకటించింది.
యూజర్ల సంఖ్యను మరింత పెంచుకోవాలనే ఆలోచనతో పేటీఎం ఈ సూపర్ ఆఫర్ ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చిందని సమాచారం అందుతోంది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని సమాచారం అందుతోంది. పేటీఎం రిఫరల్ ప్రోగ్రామ్ పేరుతో కస్టమర్లకు అదనపు క్యాష్ బ్యాక్ ను కూడా అందిస్తుండటం గమనార్హం. ఈ ఆఫర్ లో భాగంగా రిఫరల్ కోడ్ ను పంపితే 100 రూపాయల క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు.
పేటీఎం యూజర్లు వెంటనే ఈ ఆఫర్ ను వినియోగించుకుంటే మంచిదని చెప్పవచ్చు. పేటీఎం యూజర్లకు బెనిఫిట్ కలిగేలా కొత్త ఆఫర్లను అందుబాటులోకి తెస్తుండటం గమనార్హం.