OPPO Find X9 Ultra: చైనా కంపెనీ OPPO నుంచి మార్కెట్లోకి ఎన్నో రకాల మొబైల్స్ వచ్చాయి. వీటిని రోజువారీ వినియోగదారులే కాకుండా.. యూత్ తో పాటు ఉద్యోగులు, వ్యాపారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న మొబైల్స్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా ఒప్పో కంపెనీ తాజాగా Find X 9 సిరీస్ లో భాగంగా కొత్త మొబైల్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈనెల మధ్యలో దీనిని రిలీజ్ చేసే అవకాశం ఉంది. నాణ్యమైన కెమెరాతో పాటు బ్యాటరీ వ్యవస్థ మెరుగ్గా ఉండే ఈ మొబైల్ ధర కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: 27 కోట్లు పెట్టి కొంటే.. నిండా ముంచాడు.. పాపం ఆయన కష్టం పగవాడికి కూడా రావద్దు
OPPO కంపెనీ నుంచి Find X9 ఆల్ట్రా అనే మొబైల్ ఏప్రిల్ 21న లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో 6.82 అంగుళాల LTPO AMOLED డిస్ప్లే ఉండనుంది. ఈ డిస్ప్లే మూవీస్ చూసేవారితో పాటు గేమింగ్ కోరుకునే వారికి అనుగుణంగా ఉంటుంది. అలాగే ఈ మొబైల్ వేగంగా పనిచేసేందుకు ఇందులో 16 GB వరకు ర్యామ్ ఉండనుంది.512 GB స్టోరేజ్ ఉండడంతో కావాల్సిన ఫోటోలు, వీడియోలు స్టోర్ చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మార్కెట్లోకి రాబోయే ఈ మొబైల్ మోడల్ నెంబర్ CPH2841 తో అధికారిక వెబ్సైట్లో కనిపించింది. దీంతో ఇది గ్లోబల్ వేరియంట్ అని అంటున్నారు. అలాగే ఇందులో 16 GB వరకు రామ్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆక్టాకోర్ Qualcomm చిప్సెట్ ఉన్న ఈ మొబైల్ గరిష్టంగా 4.61 GHz వేగంతో పనిచేస్తుంది. ఇది స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్ సెట్ కు సమానంగా ఉంటుంది.
కెమెరా పనితీరును నాణ్యంగా ఉంచేందుకు ఈ మొబైల్ లో 50 మెగా పిక్సెల్ తో కూడిన మెయిన్ కెమెరా ఉండనుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం అధిక సామర్థ్యం మెగాపిక్సల్ తో కూడిన ఫ్రంట్ కెమెరా ఉండనుంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారు ఈ మొబైల్ తో అనుకున్న ఫోటోలను తీసుకోవచ్చని చెబుతున్నారు. అలాగే ఇందులో 7000 mAh బ్యాటరీ ఉండనుంది. ఈ బ్యాటరీ 100 W ఫాస్ట్ ఛార్జింగ్ తో పని చేయనుంది. దీంతో రోజువారీ వినియోగదారులు.. బిజీగా ఉండే వారికి ఈ బ్యాటరీ తో పాటు చార్జింగ్ సపోర్ట్ ఉండనుంది. లేటెస్ట్ టెక్నాలజీ తో పాటు కెమెరా, బ్యాటరీ వ్యవస్థ మెరుగ్గా ఉండే ఈ మొబైల్ ను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది.
