Oppo A59 5G: కాలానికి అనుగుణంగా మార్కెట్లోకి కొత్త రకమైన స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. అప్డేట్ ఫీచర్స్ తో పాటు అవసరానికి ఉపయోగపడే పరికరాలు ఈ మొబైల్స్ లో ఉంటున్నాయి. అయితే లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చే మొబైల్స్ ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ కొన్ని కంపెనీలు ప్రీమియం ఫీచర్స్ ను జోడించి తక్కువ ధరకే అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా Oppo కంపెనీకి చెందిన మొబైల్ లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉండి కూడా అతి తక్కువ ధరకే లభ్యమవుతుంది. దీంతో దీనిని కొనేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఇంతకీ ఈ మొబైల్ ఎలా ఉందంటే?
Oppo మొబైల్స్ ఒకసారి యూస్ చేస్తే మళ్లీ ఇదే కంపెనీకి చెందిన ఫోన్ కొంటారని కొందరు అంటుంటారు. అంతలా ఆకట్టుకుంటుంది ఈ కంపెనీకి చెందిన ఫోన్. అయితే లేటెస్ట్ గా Oppo A59 5G అరే మొబైల్ అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. ఇందులో కెమెరా పనితీరుతో పాటు బ్యాటరీ సామర్థ్యం.. అద్భుతమైన డిస్ప్లే ఉన్నాయి.
కెమెరా విషయానికి వస్తే ప్రధానంగా 220 MP అల్ట్రా కెమెరాను అమర్చారు. ఇది DSLR స్థాయి కెమెరా కావడంతో అద్భుతమైన ఫోటోలను షూట్ చేసుకోవచ్చు. ల్యాండ్ స్కేప్ తో పాటు పోర్టల్.. అలాగే నైట్ షార్ట్ కూడా తీసుకోవచ్చు. 4k వీడియో చిత్రీకరణకు అనుగుణంగా ఉండడంతో పాటు AI సపోర్ట్ కూడా ఇవ్వడం విశేషం. దీంతో ఫోటోగ్రఫీ వారికి ఈ మొబైల్ బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.
Oppo A59 5G స్టోరేజ్ బెటర్ గా ఉందని తెలుస్తోంది. ఇందులో 256 GB వరకు స్టోర్ చేసుకోవచ్చు. 12gb రామ్ ఉండడంతో ఎంత పెద్ద ఫైల్స్ అయినా ఫాస్ట్ గా మూవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మల్టీ టాస్కింగ్, లాంగ్ ఫ్రీ వినియోగించే వారికి కూడా ఇది అనుగుణంగా ఉంటుంది. నిమిషాల్లో యాప్ డౌన్లోడ్ కావడంతో పాటు డ్రాప్ అవుట్ లేకుండా గేమింగ్ పర్ఫామెన్స్ బెటర్ గా ఉంటుంది. ఈ మొబైల్లో 800mAh బ్యాటరీ అమర్చారు. దీంతో అల్ట్రా ఫాస్టు చార్జింగ్ టెక్నాలజీతో ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. డౌన్ టైం ను తగ్గిస్తూ వినియోగదారులకు రోజంతా చార్జింగ్ ఉండే విధంగా చేస్తుంది.
ఇలాంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్న ఈ మొబైల్ ధర రూ.11,999 నుంచి విక్రయిస్తున్నారు. ఈఎంఐ ద్వారా కొనుగోలు చేయాలని అనుకునే వారికి రూ.2,1999 నుంచి ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఈ మొబైల్ డిస్ప్లే సూపర్ అని అంటున్నారు. ఎందుకంటే ఇందులో ప్రీమియం కర్వ్ Amoled డిస్ప్లేను కలిగి ఉంది. ఇది ఎటువంటి పిక్చర్రైజేషన్ అయినా అద్భుతంగా చూపిస్తుంది. సినిమాలకు, గేమింగ్ కోసం అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. తక్కువ ధరలో మంచి ఫీచర్స్ ఉండాలని కోరుకునే వారికి ఈ మొబైల్ ది బెస్ట్ అని అంటున్నారు.