Online Shopping : కరోనా తరువాత చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు.. వ్యాపారస్తులు భారీగా నష్టపోయారు. దీంతో చాలా మంచి నష్టాన్ని పూడ్చడంలోనే ఉన్నారు. ఈ క్రమంలో ఆదాయం పెరిగే అవకాశం లేకున్నా.. వచ్చిన దానితో నెట్టుకొస్తూ.. ఖర్చులు తగ్గించుకుంటున్నారు. కొంతమంది జీవితంలో నేర్చుకున్న పాఠం ద్వారా దుబారా ఖర్చులు చేయడం లేదు. అయితే అత్యవసర వస్తువులు కొనుగోలు చేయాలనుకునేవారు పండుగలు, ప్రత్యేక రోజుల్లో కొనాలని చూస్తున్నారు. ఈ సమయంలో కొన్ని ఆన్లైన్ సంస్థలు, కంపెనీలు ఆఫర్లు పెడుతూ ఉంటాయి. కానీ ఏ కంపెనీ ఎలాంటి ఆఫర్ పెడుతుందో ఎవరూ చెప్పరు. అయితే ఓ గ్రూప్ లో జాయిన్ అయితే ఎప్పుడు ఏ కంపెనీ ఎలాంటి ఆఫర్ పెడుతుందో రోజూ తెలుసుకోవచ్చు. అదెలాగంటే?
ఆన్ లైన్ షాపింగ్ చేసేవారు నిత్యం ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంటారు. పండుగలు, ప్రత్యేక రోజుల్లో కొన్ని కంపెనీలు ప్రత్యేక ఆఫర్లు పెడుతూ ఉంటాయి. కొన్ని సేల్స్ పెంచుకునేందుకు తక్కువ ధరకే వస్తువులను అందిస్తాయి. మరికొన్ని డిస్కౌంట్లను పెంచి వినియోగదారులను ఆకర్షిస్తాయి. ముఖ్యంగా ఆన్ లైన్ సంస్థలు ఫ్లిప్ కార్ట్, ఆమెజాన్ వంటి సంస్థలు వస్తువులపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. అయితే కొన్ని ప్రముఖ కంపెనీలు దినపత్రికలు, టీవీ యాడ్లలో ప్రకటిస్తూ ఉంటాయి. కానీ చిన్న కంపెనీలు మాత్రం ఆన్ లైన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాయి.
ఈ విషయం ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంది. మొబైల్ లో Telegram యాప్ ఇప్పటి వరకు లేకుంటే ముందుగా ఇన్ స్టాల్ చేసుకోండి. ఇందులోకి వెళ్లిన తరువాత Premmium Deals అని సెర్చ్ బాక్స్ లో టైప్ చేయాలి. ఇప్పుడు ఒక గ్రూప్ కనిపిస్తుంది. అందులో కింద ఉన్న ‘జాయిన్’ అనే బటన్ పై ప్రెస్ చేస్తే అందులోకి వెళ్తారు. ఇప్పుడు ఏ కంపెనీ ఎలాంటి ఆఫర్లు ప్రకటించిందో దానికి సంబందించిన లింక్ ను ఇందులో వేస్తారు. ఈ లింక్ ఓపెన్ చేసి కావాల్సిన వస్తువును కొనుగోలు చేయొచ్చు.
గతంలో కొన్ని కంపెనీలు రూ.2,000 ఖరీదైన షూ ను కేవలం రూ.97 కే అందించింది. దీనిని హిడెన్ డీల్స్ అని అంటారు. అంటే ఒక్కోసారి ఇవి బయట కనిపించకపోయినా ఈ గ్రూపులో ఉంటుంది. అయితే ఈ డీల్స్ కాలపరమితి చాలా తక్కువ రోజులే ఉంటుంది. అందువల్ల వెంటనే కొనుగోలు చేయడం ఉత్తమం. ఇలా తక్కువ ధరకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా భారీగా డబ్బు ఆదా అవుతుంది. ఆదాయం పెరగకపోయినా తక్కువ బడ్జెట్ తో వస్తువులు కొనుగోలు చేసినా ఆదాయి పెరిగినట్లే అని భావించాలి.