OnePlus Nord 6 vs POCO X8 Pro Max Comparison: మార్కెట్లోకి ఎన్నో రకాల మొబైల్స్ వస్తూ ఉంటాయి. కొందరు తమ అవసరాలకు బడ్జెట్లోనే ఫోన్లు కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు ఆకర్షణీయంగా ఉండడానికి లగ్జరీ మొబైల్స్ కొంటూ ఉంటారు. వినియోగదారులను ఇంప్రెస్ చేయడానికి కంపెనీలు పోటీపడి కొత్త కొత్త గాడ్జెట్స్ లో మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాయి. ఇటీవల oneplus కంపెనీకి చెందిన Nord 6 అనే మొబైల్ మార్కెట్లోకి వచ్చింది. అయితే దీనికి గట్టి పోటీ ఇచ్చేందుకు POCO కంపెనీకి చెందిన X8 Pro Max రిలీజ్ చేశారు. ఈ రెండు మొబైల్స్ ఒకే వేరియంట్లను కలిగి ఉన్నప్పటికీ దేని ప్రత్యేకత దానిదే అని కొందరు అంటున్నారు. వీటిలో ఒకటి బ్యాటరీ సామర్థ్యాన్ని ఎక్కువగా కలిగి ఉండగా మరొకటి కెమెరా విషయంలో ప్రత్యేకతను కలిగి ఉంది. ఇంతకీ ఈ రెండు ఫోన్లలో ఉండే ఫీచర్లు ఏంటి? దీనిలో ఏది ప్రత్యేకంగా ఉంది?
Oneplus Nord 6 మొబైల్ లో 6.78 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. ఇది 1.5 కే AMOLED క్వాలిటీతో పనిచేస్తుంది. 165 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేసే ఇందులో స్నాప్ డ్రాగన్ 8 S Gen 4 అనే ప్రాసెసర్ ను సెట్ చేశారు. అలాగే ఇందులో 12gb రామ్ తో పాటు 256 జిబి స్టోరేజ్ ను అమర్చారు. ఇందులో 50 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ తో పనిచేస్తుంది. 32 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాతో పాటు వీడియో కాలింగ్ కోసం పనిచేస్తుంది. ఇందులో 5500 mAh బ్యాటరీ ఉండగా.. ఇది 80 W ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో పనిచేస్తుంది. ఈ మొబైల్ ధర రూ.27,000 లతో విక్రయిస్తున్నారు.
POCO X8 Pro Max మొబైల్ ఫీచర్లోకి వెళ్తే.. ఇందులో 6.83 అంగుళాల AMOLED ప్యానెల్ ఉండనుంది. ఇది 1.5 k Resolution తగ్గకుండా పనిచేస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేసే ఇందులో 9500 డైమెన్సిటీ ఉండనుంది. ఈ మొబైల్లో 50 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉండగా.. ఎయిట్ ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్ తో పనిచేస్తుంది. 20 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పాటు వీడియో కాలింగ్ కోసం పనిచేస్తుంది. ఇందులో 6500 mAh బ్యాటరీ ఉండగా ఇది 100 వాట్ హైపర్ ఛార్జింగ్‌తో సపోర్ట్ చేస్తుంది.
అయితే ఈ రెండు మొబైల్స్ వేటికవే ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. వన్ ప్లస్ మొబైల్ లో బ్యాటరీ వ్యవస్థ తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ తొందరగా చార్జింగ్ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. POCO మొబైల్లో బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా ఉండడంతో చార్జింగ్ కావడానికి సమయం పడుతుంది. బిజీగా ఉండేవారు ఎప్పుడు మొబైల్ ఉపయోగించేవారు వారి అవసరాలకు తగ్గట్టు ఈ ఫోన్లను తీసుకోవచ్చు. అలాగే గేమింగ్ కోరుకునే వారికి POCO మొబైల్ బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. ఎందుకంటే ఇందులో ఉండే అడ్వాన్స్డ్ కూలింగ్ సిస్టం తో ఫోన్ వేడెక్కకుండా కాపాడుతుంది. అలాగే మిగతా ఫీచర్లు అవసరం ఉన్నవారు ఆయా మొబైల్స్ ను ఎంచుకోవచ్చు.