OnePlus New Phones: వన్‌ప్లస్ మొబైల్స్ కు మార్కెట్లో ప్రత్యేకంగా గుర్తింపు ఉన్నాయి. ఈ కంపెనీతో పాటు దీనికి అనుబంధంగా ఉన్న ఐక్యూ నుంచి లేటేస్ట్ గా రెండు కొత్త ఫోన్లు రాబోతున్నాయి. ఇవి లేటేస్ట్ ప్లాగ్ షిప్ ను కలిగి ఉండంతో పాటు బలమైన బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉన్నాయి. వీటి గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..
OnePlus నుంచి 16, iQOO 16 రెండు లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్లు రాబోతున్నాయి. ఇవి చైనాలో మొదట లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇంజనీర్లు ప్రస్తుతం iQOO 16తో సహా ఈ ఫోన్లను యాక్టివ్‌గా టెస్ట్ చేస్తున్నారు. ఈ రెండు ఫోన్లు 2nm ప్రాసెస్‌పై ఆధారపడిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలిట్ జెన్ 6 ప్రో చిప్‌లతో రానున్నాయి. ఇది పర్ఫార్మెన్స్, బ్యాటరీ ఎఫిషియన్సీలో గణనీయమైన మెరుగుదలను అందిస్తుంది.
OnePlus 16:
OnePlus 16 మొబైల్ 1.5K రిజల్యూషన్ తో LTPO OLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 240Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 9,000mAh బ్యాటరీతో ఉండడంతో దీనికి 120W వైడెడ్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్టు చేయనుంది. కెమెరా సెటప్‌లో భాగంగా ఇందులో 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్, 50MP టెలిఫోటో ఉంటాయి. ఈ మొబైల్ IPC69 రేటింగ్, అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ , USB 3 సపోర్ట్ చేస్తుంది.
iQOO 16:
iQOO 16 ఫోన్ లో 6.85-అంగుళాల AMOLED డిస్ ప్లే ఉండనుంది. ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 200MP మెయిన్ కెమెరా సెన్సార్‌తో రానుంది. 50MP పెరిస్కోప్ టెలిఫోటో, 50MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంటాయి. Snapdragon 8 Elite Gen 6 Pro చిప్ సెట్ ను కలిగి ఉంటుంది.
OnePlus 16 , iQOO 16 రెండు 2nm చిప్‌లతో రానున్నాయి. ఇవి సుమారు 5,000 యువాన్ (సుమారు రూ.66,880) ప్రారంభ ధరతో ఉండవచ్చు, ఇది iQOO 15 ప్రారంభ ధర (4,199 యువాన్ లేదా రూ.56,160) కంటే ఎక్కువ. iQOO 16 భారతదేశంలో మధ్య నవంబర్ నుండి డిసెంబర్ 2026 మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ధర సుమారు రూ.74,990 వరకు ఉండవచ్చు.
