https://oktelugu.com/

Petrol Diesel Price: వాహనదారులకు షాకింగ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు అంత పెరుగుతాయా?

Petrol Diesel Price: మనలో చాలామంది వాహనదారులు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో అసంతృప్తితో ఉన్నారనే సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో వాహనదారులకు ఖర్చులు పెరుగుతున్నాయి. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. మరోవైపు దేశంలో ఎన్నికలు ముగింపు దశకు రావడంతో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం పడే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 2, 2022 / 04:31 PM IST
    Follow us on

    Petrol Diesel Price: మనలో చాలామంది వాహనదారులు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో అసంతృప్తితో ఉన్నారనే సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో వాహనదారులకు ఖర్చులు పెరుగుతున్నాయి. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి.

    Petrol Diesel Price

    మరోవైపు దేశంలో ఎన్నికలు ముగింపు దశకు రావడంతో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం పడే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ పై మరో 9 రూపాయల చొప్పున పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. మార్చి 7వ తేదీన ఎన్నికలు ముగియనుండగా ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అమలులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

    Also Read: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర

    ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకపోవడం వల్ల ఇప్పటికే భారీ మొత్తంలో నష్టాలు వస్తున్నాయని బోగట్టా. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే భారం మరింత పెరుగుతుంది. ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటర్ పెట్రోల్, డీజిల్ పై 6 రూపాయలకు అటూఇటుగా నష్టపోతున్నాయని బోగట్టా.

    మరోవైపు దేశంలో వంటనూనె ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పెట్రోల్ ధర మోత ప్రారంభమైతే మాత్రం వాహనదారులకు ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. పెరుగుతున్న ధరల వల్ల సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.

    Also Read: మోడీనా మజాకా.. రష్యాను నిలువరించి.. యుద్ధాన్ని 6 గంటలు ఆపిన ప్రధాని

    Recommended Video: