https://oktelugu.com/

Maruthi Car Offers: బంఫర్ ఆఫర్లు ప్రకటించిన మారుతి.. భారీ తగ్గింపుతో వచ్చే కార్లు ఇవే..

పండుగలు, ప్రత్యేక రోజులతో సంబంధం లేకుండా తమ సేల్స్ పెంచుకోవడానికి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. తాజాగా కార్ల దిగ్గజ కంపెనీ మారుతి కొన్ని కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.

Written By:
  • Srinivas
  • , Updated On : February 12, 2024 / 11:03 AM IST
    Follow us on

    Maruthi Car Offers:  కారు కొనాలని చాలా మందికి ఉంటుంది. కానీ తక్కువ ధరలో మంచిఫీచర్స్ ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి వారి కోసం కొన్ని కంపెనీలో ఒక్కోసారి ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. పండుగలు, ప్రత్యేక రోజులతో సంబంధం లేకుండా తమ సేల్స్ పెంచుకోవడానికి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. తాజాగా కార్ల దిగ్గజ కంపెనీ మారుతి కొన్ని కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఓ కారుపై ఏకంగా రూ.62 వేల వరకు ప్రయోజనాన్ని కల్పిస్తుంది. మరి ఆ కార్ల వివరాలేంటో చూద్దామా..

    దేశంలోని కార్ల ఉత్పత్తిలో నెంబర్ వన్ గా నిలుస్తుంది మారుతి కంపెనీ. దీని నుంచి వచ్చిన ఎన్నో మోడళ్లు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయినా కొన్ని కార్లపై ఒక్కోసారి భారీ డిస్కౌంట్ ను ప్రకటిస్తూ ఆకర్షిస్తుంది. తాజాగా కొన్ని మోడళ్లపై భారీగా తగ్గింపును ప్రకటించింది. వీటిలో ఆల్టో, వ్యాగన్ ఆర్, ఎస్ ప్రెస్సో వంటివి ఉన్నాయి. వీటిలో వ్యాగన్ ఆర్ ది బెస్ట్ మోడల్ గా నిలిచినప్పటికీ ఈ కారు వినియోగదారులు సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో తగ్గింపును ప్రకటించింది.

    మారుతి వ్యాగన్ ఆర్ సేల్స్ తో నెంబర్ 2 గా నిలుస్తోంది. కొన్నేళ్లుగా ఈ మోడల్ అత్యంద ప్రజాదరణ పొందుతోంది. మారుతి వ్యాగన్ ఆర్ 55.92 బీహెచ్ పీ పవర్ తో పాటు 113 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ ఆటోమేటిక్ గేర్ తో పనిచేస్తూ లీటర్ పెట్రోల్ కు 23.56 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.5.54 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.7.38 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఈ కారుపై మొత్తం రూ.61 వేల వరకు డిస్కౌంట్ ను అందిస్తున్నారు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ.40 వేలు, ఎక్ఛేంజ్ రూ.15 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.6 వేలు లభిస్తోంది.

    ఇదే కంపెనీ నుంచి మరో మోడల్ ఆల్టో కే 10 పై రూ. 62 వేల తగ్గింపును ప్రకటించింది. ఇందులో రూ.40 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.15 వేల ఎక్చేంజ్ ఆఫర్, రూ.7 వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. ఇదే ఆల్టో సీఎన్ జీ వెర్షన్ పై రూ.40 వేల తగ్గింపు ప్రకటించింది. ఇందులో 18 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.15 వేల ఎక్చేంజ్ ఆఫర్, రూ.7వేల కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి. మారుతికి చెందిన ఎస్ ప్రెస్సో కారుపై రూ.61 వేల తగ్గింపు ఆఫర్ ను ఇచ్చారు. ఇందులో రూ.39 వేలు, పెట్రోల్ ట్రిమ్ పై రూ.40 వేల డిస్కౌంట్ ఉన్నాయి.