Odysse Electric : మనదేశంలో ఒడిస్సీ తన సరికొత్త ఎవోకిస్ లైట్(Evoqis Lite) ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్‌ను విడుదల చేసింది. దీని ధర కేవలం రూ. 1.18 లక్షలు మాత్రమే. దీంతో ఇది ఇండియాలోనే అత్యంత చౌకైన ఈ-స్పోర్ట్స్ బైక్‌గా నిలిచింది. ఎవోకిస్ లైట్ డిజైన్ దాదాపుగా కవాసకి నింజా 300ని పోలి ఉంటుంది.
ఇందులో డ్యూయల్ హెడ్‌లైట్స్, ట్రాన్స్‌పరెంట్ విండ్‌స్క్రీన్, ఫెయిరింగ్-మౌంటెడ్ మిర్రర్స్, స్ప్లిట్ సీట్ సెటప్, స్టైలిష్ టెయిల్ లైట్స్ అందించారు. బైక్ ఫెయిరింగ్‌పై ట్రాన్స్‌ఫార్మర్స్ మూవీ సిరీస్ లోని ఆటోబాట్స్ లోగో కూడా అందించారు. ఇది దీనికి ప్రత్యేకమైన లుక్‌ను ఇస్తుంది.
ఎవోకిస్ లైట్లో 60V బ్యాటరీ అమర్చారు. దీని వలన బైక్ గరిష్ట వేగం 75 కిమీ/గం వరకు ఉంటుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే బైక్ 90 కిమీ వరకు రేంజ్‌ను ఇస్తుంది. ఇందులో వెనుక హబ్ మోటార్ అమర్చారు. ఇది స్మూత్, సైలెంట్ రైడింగ్ ఎక్సపీరియన్స్ అందిస్తుంది. స్టైలిష్, పవర్ ఫుల్ రైడింగ్‌ను కోరుకునే, కానీ పెట్రోల్ బైక్ లాంటి శబ్దం, పొగను ఇష్టపడని వినియోగదారుల కోసం ఈ బైక్ ప్రత్యేకంగా రూపొందించారు.
Also Read : పెట్రోల్ ఖర్చులకు భయపడాల్సిన పనిలేదు! హీరో తీసుకొచ్చింది సూపర్ మైలేజ్ బైక్!
తక్కువ ధర ఉన్నప్పటికీ ఎవోకిస్ లైట్ అనేక అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఇవి వివిధ పరిస్థితుల్లో మంచి రైడింగ్ ఎక్సపీరియన్స్ అందిస్తాయి. బైక్‌లో కీ-లెస్ ఇగ్నిషన్ సిస్టమ్ అమర్చారు, దీని వలన తాళం లేకుండా కూడా బైక్‌ను స్టార్ట్ చేయవచ్చు. మోటార్ కట్-ఆఫ్ స్విచ్, యాంటీ-థెఫ్ట్ లాక్ వంటి సౌకర్యాలు సేఫ్టీని మరింత బలపరుస్తాయి. ఇందులో స్మార్ట్ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది బ్యాటరీ లైఫ్ టైం, పర్ఫామెన్స్ మెరుగుపరుస్తుంది. సేఫ్టీ కోసం ముందు భాగంలో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు, వెనుక భాగంలో సింగిల్ డిస్క్ బ్రేక్ అందించారు. సాధారణంగా ఇలాంటి ఫీచర్లు పెద్ద 650cc బైక్‌లలో మాత్రమే కనిపిస్తాయి.
ఎవోకిస్ లైట్ ను ఐదు అద్భుతమైన రంగుల్లో విడుదల చేశారు. వినియోగదారులు కోబాల్ట్ బ్లూ, ఫైర్ రెడ్, లైమ్ గ్రీన్, మాగ్నా వైట్, బ్లాక్ వంటి ఎట్రాక్టివ్ కలర్ ఆప్షన్లలో మీకు నచ్చింది సెలక్ట్ చేసుకోవచ్చు. ఇవి బైక్‌ను మరింత స్టైలిష్‌గా చేస్తాయి.
Also Read : గుడ్‌బై జీ310ఆర్, జీ310జీఎస్.. భారత్‌లో బీఎండబ్ల్యూ దుకాణం బంద్