Nvidia: అసలేంటి ఎన్విడియా.. ఏకంగా రిలయన్స్ మార్కెట్ విలువను ఒక్కరోజులోనే ఎలా దాటేసింది?

అమెరికాకు చెందిన ఎన్విడియా(Nvidia) అనే సంస్థ చిప్ లు తయారు చేస్తూ ఉంటుంది. ఈ సంస్థ త్రైమాసిక ఫలితాలను ఆకర్షణీయంగా ప్రకటించింది.

Written By: Velishala Suresh, Updated On : February 23, 2024 6:14 pm
Follow us on

Nvidia: సాధారణంగా స్టాక్ మార్కెట్లో పేరుపొందిన కంపెనీ షేర్లను ఇన్వెస్టర్లు కొంటారు. ఎప్పుడైనా ఒడిదుడుకులు ఏర్పడినప్పుడు ఇతర కంపెనీల వైపు మళ్ళుతారు. ఇలాంటి సమయంలో కొన్ని కంపెనీల షేర్లు పెరుగుతాయి. ఇంకొన్ని కంపెనీల షేర్లు నేల చూపులు చూస్తాయి. అంతేకానీ ఏకపక్షంగా ఒకటే కంపెనీ మార్కెట్ మొత్తాన్ని శాసించలేదు. కానీ శుక్రవారం స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదయింది. అది కూడా గతానికంటే భిన్నంగా చిప్ తయారీ సంస్థ భారీగా లాభాలు గడించింది.. పెద్ద పెద్ద కంపెనీల స్థాయిని అవ లీలగా దాటేసింది. ఇంతకీ ఏమిటా కంపెనీ? పెద్దపెద్ద కంపెనీలను ఎలా దాటగలిగింది?

అమెరికాకు చెందిన ఎన్విడియా(Nvidia) అనే సంస్థ చిప్ లు తయారు చేస్తూ ఉంటుంది. ఈ సంస్థ త్రైమాసిక ఫలితాలను ఆకర్షణీయంగా ప్రకటించింది. దీంతో సహజంగానే ఆ కంపెనీ షేర్ పెరుగుతుందని మార్కెట్ నిపుణులు భావించారు. కానీ వారు అంచనా వేసిన దానికంటే ఒక్కరోజులోనే 16% షేర్ల ధర పెరగడంతో ఒకసారిగా కంపెనీ మార్కెట్ విలువ తారాజువ్వలాగా ఎగిసింది. ఒక్క రోజులోనే రెండు బిలియన్ డాలర్ల మేర కంపెనీ విలువ పెరగడం ఆశ్చర్యానికి గురి చేసిందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇలా పెరిగిన విలువలో ఎన్విడియా సరికొత్త రికార్డు సృష్టించింది. భారతదేశానికి చెందిన అతి పెద్ద వ్యాపార సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువను పోవడం విశేషం.

వాల్ స్ట్రీట్ చరిత్ర ప్రకారం ఒక రోజులోనే ఒక కంపెనీ సంపద ఇంత మొత్తంలో పెరగడం ఇదే తొలిసారి. ఫేస్ బుక్ మాతృ సంస్థ అయిన మెటా త్రైమాసిక ఫలితాలను ఆసక్తికరంగా ప్రకటించింది. దీంతో ఫిబ్రవరి రెండో తేదీన ఆ కంపెనీ షేర్లు పెరిగాయి.. ఆ పెరుగుదలతో మెటా కంపెనీ 196 బిలియన్ డాలర్ల సంపదను వెనకేసుకుంది. అయితే ఇదే ఇప్పటివరకు వాల్ స్ట్రీట్ లో రికార్డ్ గా ఉండేది. ఆ రికార్డును ఎన్విడియా తిరగరాసింది. ఫలితంగా వాల్ స్ట్రీట్ లో మైక్రోసాఫ్ట్ (మూడు ట్రిలియన్ డాలర్లు), యాపిల్ (2.8 ట్రిలియన్ డాలర్లు), తర్వాత అతిపెద్ద స్టాక్ గా నిలిచింది. మంచి వ్యాప్తంగా చూసినప్పుడు సౌదీ అరామ్ కో(2 ట్రిలియన్ డాలర్లు) తర్వాత 1.89 బిలియన్ డాలర్లతో అతిపెద్ద స్టాక్ గా నిలిచింది.

అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా ఎన్విడియా కార్యకలాపాలు సాగిస్తూ ఉంటుంది. హై ఎండ్ ఏఐ చిప్ మార్కెట్లో 80 శాతం వాటా ఈ కంపెనీదే. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. ఈ కంపెనీ మార్కెట్ అంచనాలకు భిన్నంగా ఆదాయాన్ని నమోదు చేసింది. డిసెంబర్ నెలలో ముగిసిన నాలుగవ త్రైమాసికంలో 22.10 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. త్రైమాసిక ఫలితాలలో మెరుగైన భవిష్యత్తు అంచనాలు ప్రకటించింది. దీంతో వాల్ స్ట్రీట్ లోని 17 బ్రోకరేజ్ సంస్థలు ఈ స్టాక్ కు బై రేటింగ్ ఇచ్చాయి. అంతేకాదు ప్రైస్ టార్గెట్ 1100 నుంచి 1400 డాలర్లకు పెంచాయి. దీంతో గురువారం నాటి ట్రేడింగ్ లో కంపెనీ షేర్ 16% మేర రాణించి 785.38 డాలర్ల వద్ద ముగియడం విశేషం.

ఎన్విడియా దేశీయ దిగ్గజం రిలయన్స్ ను కూడా దాటేయడం విశేషం..ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ 20 లక్షల కోట్లను దాటింది. ప్రస్తుత డాలర్ ప్రకారం రిలయన్స్ మార్కెట్ విలువ 243 బిలియన్ డాలర్లుగా ఉంది. ఐతే ఎన్విడియా ఒక్క రోజు పోగేసుకున్న సంపద రిలయన్స్ పూర్తి విలువ కంటే అధికం. రిలయన్స్ మాత్రమే కాదు బ్యాంక్ ఆఫ్ ఇండియా( 265 బిలియన్ డాలర్లు), కోకా – కోలా(264 డాలర్లు) నెట్ ఫ్లిక్స్( 255 బిలియన్ డాలర్లు), యాక్సెంచర్ (233 బిలియన్ డాలర్లు), మెక్ డొనాల్డ్స్ ( 214 బిలియన్ డాలర్లు) వంటి కంపెనీ ల మార్కెట్ విలువను ఎన్విడియా దాటేయడం విశేషం.