Nothing Phone 4b: మార్కెట్లో తనదైన ప్రత్యేకమైన డిజైన్, ఫీచర్లతో Nothing మొబైల్ కంపెనీ సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ కంపెనీ నుంచి తాజాగా మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రావడానికి సిద్ధమైంది. Nothing Phone 4b. ఇప్పటివరకు వచ్చిన ఫ్లాగ్‌షిప్ ‘a’ సక్సెస్ తరుతవా సరికొత్తగా ‘b’ సిరీస్‌ను కంపెనీ లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన లాంచ్ డేట్, ఫీచర్లు, ధర మరియు స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నథింగ్ కంపెనీ అధికారిక ప్రకటన ప్రకారం.. Nothing Phone 4b భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా జూలై 7న గ్రాండ్‌గా లాంచ్ కానుంది. దీనిని ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఈ లాంచ్‌లో భారతీయ క్రికెట్ అభిమానుల కోసం నథింగ్ ఒక అద్భుతమైన సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ RCBతో కుదుర్చుకున్న భాగస్వామ్యానికి గుర్తుగా, ప్రత్యేకమైన Nothing Phone 4b RCB Edition ను కూడా కంపెనీ ప్రదర్శించింది.
నథింగ్ ఫోన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది డిజైన్, గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ ఎల్‌ఈడీ లైట్లు. Phone 4b లో కూడా నథింగ్ మార్క్ గ్లిఫ్ బార్ డిజైన్ సరికొత్త మెటాలిక్ స్ట్రిప్ అందించారు. డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఇందులో 6.77 అంగుళాల Full HD ప్లస్ AMOLED స్క్రీన్‌ను చేర్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో రావడం వల్ల స్క్రోలింగ్, గేమింగ్ వీడియో కంటెంట్ ఎక్స్‌పీరియన్స్ అత్యంత స్మూత్‌గా ఉండబోతోంది.
ఈ సరికొత్త మిడ్‌రేంజ్ ఫోన్ పర్ఫార్మెన్స్ కోసం క్వాల్కమ్ లేటెస్ట్ Snapdragon 6 Gen 4 ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. దీంతో బ్యాటరీ లైఫ్ ఆదా అవ్వడమే కాకుండా మల్టీటాస్కింగ్ సులువుగా సాగుతుంది. ఇందులో 8GB RAM, 128GB/256GB స్టోరేజ్ ఆప్షన్లు ఉండనున్నాయి. సాఫ్ట్‌వేర్ పరంగా, ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ బేస్డ్ Nothing OS క్లీన్ అండ్ బ్లోట్‌వేర్-ఫ్రీ ఇంటర్‌ఫేస్‌తో రన్ అవుతుంది.
కెమెరా విషయానికొస్తే.. వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉండే అవకాశం ఉంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP కెమెరాను అమర్చారు. ఈ మొబైల్ లో 5400 mAh పవర్‌ఫుల్ బ్యాటరీ ఉండగా.. దానికి సపోర్ట్‌గా 33W లేదా 45W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అందించనున్నారు. Nothing Phone 4b బేస్ వేరియంట్ ధర భారతదేశంలో రూ. 22,999 నుంచి రూ. 25,999 మధ్య ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే స్పెషల్ RCB ఎడిషన్ ధర సుమారు రూ. 25,999 లేదా కొద్దిగా అదనపు ప్రీమియం ధరతో లభించవచ్చని మార్కెట్ నిపుణుల అంచనా.
