https://oktelugu.com/

ఏటీఎం నుంచి డబ్బులు రాలేదా.. బ్యాంకు నుంచి పెనాల్టీ పొందే ఛాన్స్..?

మనలో చాలామంది బ్యాంకు లావాదేవీల కొరకు ఏటీఎంలను వినియోగిస్తూ ఉంటారు. కొన్నిసార్లు బ్యాంకు లావాదేవీలు చేయడానికి ఏటీఎంలకు వెళ్లినప్పుడు ఏదైనా కారణం వల్ల బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అయినా ఏటీఎం నుంచి మాత్రం డబ్బులు రావు. అలా జరిగిన సమయంలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నిసార్లు కట్ అయిన డబ్బులు కొన్నిరోజుల సమయంలోనే బ్యాంకు ఖాతాలో జమ అవుతుంటాయి. డబ్బులు ఖాతాలో జమ అయితే ఏ సమస్య లేదు కానీ జమ కాకపోతే […]

Written By: , Updated On : August 7, 2021 / 09:29 AM IST
Follow us on

మనలో చాలామంది బ్యాంకు లావాదేవీల కొరకు ఏటీఎంలను వినియోగిస్తూ ఉంటారు. కొన్నిసార్లు బ్యాంకు లావాదేవీలు చేయడానికి ఏటీఎంలకు వెళ్లినప్పుడు ఏదైనా కారణం వల్ల బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అయినా ఏటీఎం నుంచి మాత్రం డబ్బులు రావు. అలా జరిగిన సమయంలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నిసార్లు కట్ అయిన డబ్బులు కొన్నిరోజుల సమయంలోనే బ్యాంకు ఖాతాలో జమ అవుతుంటాయి.

డబ్బులు ఖాతాలో జమ అయితే ఏ సమస్య లేదు కానీ జమ కాకపోతే మాత్రం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. డబ్బులు జమ కాని పక్షంలో వెంటనే సంబంధిత బ్యాంక్ కు లావాదేవీకి సంబంధించి ఫిర్యాదు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి లావాదేవీలు చేసినా సులభంగా డబ్బులు విత్ డ్రా చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది. బ్యాంకులో ఫిర్యాదు చేసిన తర్వాత 12 రోజుల్లో సమస్య పరిష్కారం అవ్వాలి.

12 రోజుల్లోగా సమస్యను పరిష్కరించని పక్షంలో బ్యాంకు ఖాతాదారునికి పెనాల్టీ విధించాల్సి ఉంటుంది. 2011 సంవత్సరం జులై నెల 1వ తేదీ నుంచి దేశంలో ఈ నిబంధన అమలులోకి వచ్చింది. బ్యాంకు సమస్యను పరిష్కరించడంలో 7 పనిదినాల కంటే ఎక్కువ రోజులు ఆలస్యం చేస్తే తప్పనిసరిగా పెనాల్టీని చెల్లించాలి. బ్యాంకులు ఫిర్యాదుకు స్పందించకపోతే స్థానిక బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.

ఏటీఎం నుంచి డబ్బులు రాకుండా బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అయితే ఏ మాత్రం కంగారు పడకుండా ఈ విధంగా చేయడం ద్వారా డబ్బులను ఖాతాలోకి తిరిగి పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.