https://oktelugu.com/

Renault Duster : దీపావళికి కొత్త డస్టర్.. లుక్, ఫీచర్స్ కేక.. ఒక్కసారి లుక్కేయండి..

రెనాల్ట్ కంపెనీ నుంచి రిలీజ్ అయిన మొదటి డస్టర్ ఆకట్టుకునే విధంగా మూడో తరం మరింత ఆకట్టుకునే విధంగా ఉండనున్నట్లు కొన్ని ఫొటోలు, ఫీచర్లను బట్టి తెలుస్తోంది. కొత్త డస్టర్ కు సంబంధించిన పిక్స్ కారు ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అవి ఎలా ఉన్నాయంటే?

Written By:
  • Srinivas
  • , Updated On : September 20, 2024 / 04:49 PM IST

    Renault Next Gen Duster

    Follow us on

    Renault Duster : రెనాల్ట్ డస్టర్ గురించి తొమ్మిదేళ్ల కింద కారు వినియోగదారులకు చాలా తెలుసు. ఆ సమయంలో కార్ల ప్రపంచంలో విజేతగా ఉన్న డస్టర్ కొన్నాళ్ల పాటు అందరినీ ఆకర్షించింది. అయితే రెండు వెర్షన్లు మార్కెట్లోకి వచ్చిన డస్టర్ ఇప్పుడు మూడో వెర్షన్ రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే కొత్త డస్టర్ గురించి సమాచారం రెనాల్ట్ కంపెనీ బయటపెట్టింది. అయితే తాజాగా దీని గురించి మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. రెనాల్ట్ కంపెనీ నుంచి రిలీజ్ అయిన మొదటి డస్టర్ ఆకట్టుకునే విధంగా మూడో తరం మరింత ఆకట్టుకునే విధంగా ఉండనున్నట్లు కొన్ని ఫొటోలు, ఫీచర్లను బట్టి తెలుస్తోంది. కొత్త డస్టర్ కు సంబంధించిన పిక్స్ కారు ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అవి ఎలా ఉన్నాయంటే?

    రెనాల్ట్ రాబోతున్న కొత్త డస్టర్.. పేరు పాతదే అయినా ఇందులో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. జర్మనీకి చెందిన రెనాల్ట్ కంపెనీ కొత్త కారు గురించి వివరాలు బయటపెట్టింది. ఇందులో కస్టమ్ ర్యాప్, బాడీ కిట్ ఉండనున్నాయి. ఆకర్షించేర అల్లాయ్ వీల్స్, లోయరింగ్ కిట్ ఉన్నాయి. ఫ్రంట్, రియర్ బంపర్ లతో పాటు ప్లేర్డ్ ఫెండర్, ఎక్ష్ టెన్స్ ఆకర్షించనున్నాయి. డోర్ గార్నిష్ స్పోర్టీ ఎలిమెంట్స్ తో పాటు బోనెట్ కు హుడ్ స్కూప్ ఉంది.

    ఆకట్టుకునే డిజైన్ తో పాటు అనుభూతి కలిగించే కార్పాయింట్ బంఫర్, హుడ్ స్కూప్ ఉన్నాయి. డోర్ గార్నిష్ పై రెడ్ కలర్ యాసెంట్ ను వేశారు. బ్రేక్ కాలిఫర్ కూడా రెడ్ కలర్ లో ఉండడంతో చూపరులను ఆకట్టుకుంటుంది. ఎక్సీటీరియర్ లో ఈ కారుకు అల్లాయ్ వీల్స్ ఉండనున్నాయి. ఇవి 21 అంగుళాలు ఉండే అవకాశం ఉంది. తక్కువ ప్రొఫైల్ తో అమర్చబడిన టైర్లు ఒరిజినల్ యూనిట్ల కంటే బిగ్ సైజులో ఉండనున్నాయి.

    రెనాల్ట్ కొత్త డస్టర్ హైబ్రిడ్ ఇంజిన్ ను కలిగి ఉండనుంది. ఇందులో సెల్ఫ్ ఛార్జింగ్ కోసం మైల్డ్ సెటప్ ను అమర్చారు. మరోవైపు 1.3 లీటర్ పెట్రోల్ ఉత్పత్తితో 128 బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ తో పోలిస్తే మాత్రం ఇది తక్కువే అని చెప్పాలి. కస్టమైజ్డ్ డస్టర్ కారు పాయింట్ ఎడిషన్ మెరుగైన ఎంపిక అని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. ఎందుకంటే గత డస్టర్ ఎంతో ఆకట్టుకుండగా కొత్త కారు ఆకర్షణీయమైన ఫీచర్స్ ను కలిగి ఉంటుందని చెబుతున్నారు.

    కొత్త డస్టర్ వచ్చే దీపావళి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 7 సీటర్ కలిగిన దీనిని రూ. 10 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కారును చూస్తే లగ్జరీ కారు లాగా అనిపిస్తుంది. అంతేకాకుండా స్పోర్ట్స్ లుక్ కారు కొనాలని ఆసక్తిగా ఉన్న వారు కొత్త డస్టర్ బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. అంతేకాకుండా ఈ మధ్య హైబ్రిడ్ ఇంజిన్ ను కోరకుంటున్నారు. దీంతో ఈ కారు రెండు విధాలుగా పనిచేయనుంది.