https://oktelugu.com/

Netflix: అన్నీ ఓటీటీలు దూసుకెళుతుంటే నెట్ ఫ్లిక్స్ ఎందుకు దూరమవుతోంది!

Netflix: ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ మిగతా సంస్థలతో పోటీ పడలేకపోతుంది. ఫలితంగా రోజురోజుకు ఈ సంస్థ గ్రాఫ్ తగ్గిపోతుంది. ఆసియా దేశాల కంటే యూరప్ దేశాల్లో నెట్ ప్లిక్స్ సబ్ స్క్రైబర్స్ భారీగా తగ్గిపోతున్నారు. ఇదిలాగే కొనసాగితే మరింత మంది స్క్రైబర్స్ తగ్గే ప్రమాదం ఉందని అంటున్నారు. అయితే భారత్ తో పాటు ఆసియా దేశాల్లో మాత్రం దీనిని ఆదరిస్తున్నారు. ఆసియా ఫసిఫిక్ రీజియన్లో ఏడాది తొలి త్రైమాసికంలో పది లక్షలకు పైగా స్క్రైబర్స్ పెరిగారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : April 21, 2022 / 10:36 AM IST
    Follow us on

    Netflix: ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ మిగతా సంస్థలతో పోటీ పడలేకపోతుంది. ఫలితంగా రోజురోజుకు ఈ సంస్థ గ్రాఫ్ తగ్గిపోతుంది. ఆసియా దేశాల కంటే యూరప్ దేశాల్లో నెట్ ప్లిక్స్ సబ్ స్క్రైబర్స్ భారీగా తగ్గిపోతున్నారు. ఇదిలాగే కొనసాగితే మరింత మంది స్క్రైబర్స్ తగ్గే ప్రమాదం ఉందని అంటున్నారు. అయితే భారత్ తో పాటు ఆసియా దేశాల్లో మాత్రం దీనిని ఆదరిస్తున్నారు. ఆసియా ఫసిఫిక్ రీజియన్లో ఏడాది తొలి త్రైమాసికంలో పది లక్షలకు పైగా స్క్రైబర్స్ పెరిగారు. ఈ మేరకు సంస్థ సీఈవో రీడ్ హాస్టింగ్స్ సైతం స్క్రైబర్స్ తగ్గడాన్ని ఒప్పేసుకున్నారు. దీంతో ముందు ముందు ఈ సంస్థ పరిస్థితి ఎటు దారి తీస్తుందోనని చర్చించుకుంటున్నారు.

    Netflix

    ఓటీటీ ఫ్లాట్ ఫాం ప్రారంభంలో నెట్ ఫ్లిక్ష్ హవానే సాగింది. మిగతా వాటికంటే నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ ఎక్కువగా ఉండేది. భారీ చిత్రాలను సైతం పెద్ద మొత్తంతో కొనుగోలు చేసి తమ స్క్రైబర్స్ ను ఆకర్షించేంది. అయితే మిగతా వాటి కంటే నెట్ ఫ్లిక్స కొంచెం ఎక్కువే రేటు ఉంచేది. ఈ సమయంలో పోటీ దారులైన అమెజాన్, హులు తమ స్క్రైబర్స్ రేట్స్ ను తగ్గించేశాయి. నెట్ ఫ్లిక్స్ నెలకు విధించే రుసుముతో పోటీదారు సంస్థలు ఏడాదంతా చూపించారు. అయినా గతేడాది వరకు నెట్ ఫ్లిక్స్ క్రేజ్ తగ్గలేదు. అయితే మిగతా సంస్థల బాటలో నెట్ ఫ్లిక్ష్ కూడా రేట్లను తగ్గించింది. కానీ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో స్క్రైబర్స్ భారీగా తగ్గారు.

    Also Read: Rajamouli Eega Movie: ఆయ‌న మీద కోపంతోనే జ‌క్క‌న్న ఈగ మూవీని తీశాడంట‌..!

    అయితే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాలో నెట్ ప్లిక్స్ సేవలను నిలిపివేసింది. దీంతో స్క్రైబర్స్ తగ్గినట్లు ఆ సంస్థ సీఈవో రీడ్ హాస్టింగ్స్ తెలిపారు. నెట్ ఫ్లిక్స్ కారణంగా నష్ట నివారణకు ఇతర సంస్థలు తమ ఫ్టాట్ ఫామ్స్ లో ప్రకటనలు చొప్పించాయి దీంతో వారికి నష్టం భారీగా ఏర్పడింది. ఆ నష్టం నెట్ ఫ్లిక్స్ పై కూడా పడింది. ఈ కారణంగా కెనడా యూఎస్ లో 6,40,000 మంది స్క్రైబర్స్ తగ్గగా..యూరఫ్, మిడిల్ ఈస్ట్, ఆప్రికా దేశాల్లో 3,00,00 మంది స్క్రైబర్స్ తగ్గిపోయారు. లాటిన్ అమెరికాలో 3,50,000 మంది నెట్ ఫ్లిక్స్ నుంచి దూరమయ్యారు. మరో మూడు నెలల్లో 25 లక్షల మంది తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.

    నష్ట నివారణకు యాడ్ష్ ను ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదని సంస్థ ప్రతినిధులు పేర్కంటున్నారు. యాడ్ మార్కెట్ ప్రమోషన్ వల్ల ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కు లాభం చేకూరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఎలాంటి అంతరాయాలు లేకపోయినా నెట్ ప్లిక్స్ వినియోగదారుల సంఖ్య తగ్గుతోంది. మరి ప్రకటనలు విరివిగా వస్తే సంస్థకు రాబడి రావచ్చు.. కానీ వినియోగదారులు సంఖ్య తగ్గే ప్రమాదంఉంది. ఈ పరిస్థితుల్లో నెట్ ఫ్లిక్ష్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

    Also Read: Megastar Chiranjeevi: చిరు అరుదైన రికార్డు.. ఐదుగురు అక్కాచెల్లెళ్ల‌తో ఆడిపాడిన ఏకైక హీరో..!

    Recommended Videos