https://oktelugu.com/

Name Ringtone: మీ పేరుతో రింగ్ సెట్ చేసుకోవడం ఎలాగంటే?

కొందరు వాళ్ల పేరుతో రింగ్ టోన్ పెట్టుకుంటారు. మనకి ఎవరైనా కాల్ చేస్తే మన పేరుతో కాల్ వినిపిస్తుంది. అయితే ఈ రింగ్ టోన్ పెట్టుకోవడం ఎలాగో కొందరికి తెలియదు. దీనికోసం ఓ తెగ గూగుల్ చేస్తుంటారు. అయిన కూడా వారు అనుకున్నట్లు పెట్టుకోలేరు. మరి పేరుతో వచ్చే రింగ్ టోన్‌ను ఎలా సెట్ చేసుకోవాలో ఈ రోజు స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 19, 2024 / 05:48 AM IST

    Name ringtone maker

    Follow us on

    Name Ringtone: ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఎక్కువగా వాడుతున్నారు. నిజం చెప్పాలంటే మొబైల్ లేకపోతే అసలు ఉండలేరు. మొబైల్‌లో ఏదో ఒక సెట్టింగ్ మార్చుకుంటూ లేదా రీల్స్ చూస్తూ 24 గంటలు కూడా యూజ్ చేస్తుంటారు. ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ప్రతి నిమిషం కూడా మొబైల్‌లోనే ఉంటున్నారు. భోజనం చేసినప్పుడు, చదివినప్పుడు, వంట చేసినప్పుడు ఆఖరుకి బాత్‌రూమ్‌లో ఉన్నప్పుడు కూడా మొబైల్‌ను వదలడం లేదు. కేవలం పెద్దవాళ్లు అనే కాకుండా పిల్లలు కూడా మొబైల్ ఎక్కువగా చూస్తున్నారు. మొబైల్‌లో ఉండే సెట్టింగ్‌లు అందరిలా కాకుండా కొత్తగా ఉండాలని ట్రై చేస్తున్నారు. ఉదాహరణకు ఫొటో ఎడిట్, కాలర్ టోన్, రింగ్ టోన్ ఇలా ఎన్నో రకాలుగా కూడా ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ఏవైనా సెట్టింగ్‌లు తెలియకపోతే వెంటనే గూగుల్ చేస్తున్నారు. అయితే మనం ఎవరికైనా కాల్ చేస్తే కొందరు కొత్తగా పాటలు వినిపిస్తాయి. అంటే వాళ్లకి నచ్చిన పాటలు పెట్టుకుంటారు. ఇది కేవలం కాల్ చేసిన వాళ్లకు మాత్రమే వినిపిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో కొందరు కొత్త కొత్త రింగ్ టోన్‌లు పెట్టుకుంటున్నారు. కాల్ వస్తే ఇది కేవలం మనకి మాత్రమే వినిపిస్తుంది. కొందరు వాళ్ల పేరుతో రింగ్ టోన్ పెట్టుకుంటారు. మనకి ఎవరైనా కాల్ చేస్తే మన పేరుతో కాల్ వినిపిస్తుంది. అయితే ఈ రింగ్ టోన్ పెట్టుకోవడం ఎలాగో కొందరికి తెలియదు. దీనికోసం ఓ తెగ గూగుల్ చేస్తుంటారు. అయిన కూడా వారు అనుకున్నట్లు పెట్టుకోలేరు. మరి పేరుతో వచ్చే రింగ్ టోన్‌ను ఎలా సెట్ చేసుకోవాలో ఈ రోజు స్టోరీలో తెలుసుకుందాం.

    మీ పేరుతో రింగ్ టోన్‌ను సెట్ చేసుకోవాలంటే.. మొదటిగా గూగుల్ లేదా క్రోమ్‌‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత ప్రొకేరాలా రింగ్‌టోన్(prokerala ringtone) అని సెర్చ్ చేయాలి. పైన వచ్చిన లింక్ ఓపెన్ చేస్తే కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో నేమ్ రింగ్‌టోన్ మేకర్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మళ్లీ కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మొదటిగా మీ పేరు ఇవ్వాలి. అంటే మీకు ఏ పేరు మీద అయితే రింగ్ టోన్ కావాలో ఆ పేరు ఇవ్వాలి. పికప్ కాల్ దగ్గర ఏదో ఒకటి మ్యాటర్ టైప్ చేయాలి. ఆ తర్వాత మేక్ రింగ్‌టోన్‌పైన క్లిక్ చేయాలి. దీంతో మీకు చాలా ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మీకు నచ్చిన రింగ్ టోన్‌ను సెలక్ట్ చేసుకుని వినాలి. మీకు కావాలంటే క్రియేట్ యూ ఆర్ రింగ్ టోన్‌‌పై సెలక్ట్ చేసి డౌన్‌లోడ్ చేసుకుంటే.. మీ రింగ్ టోన్ రెడీ. ఇది చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. కేవలం ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.