Motorola Edge 70 Ultra: స్మార్ట్ ఫోన్ మార్కెట్లో కొత్త కు.. ఆధునికతకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అందువల్లే కంపెనీలు కొత్త కొత్త ఉత్పత్తులను తయారుచేస్తూ ఉంటాయి. అంతకుమించి అనేలాగా, అందులో సౌకర్యాలు కల్పిస్తుంటాయి. 2025 లో ఎన్నో మోడల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. ఇందులో కొన్ని మాత్రమే ఆకట్టుకున్నాయి. ఇక 2026 లో మరిన్ని మోడల్స్ తీసుకొచ్చేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు తమ మోడల్స్ ను ఆవిష్కరించే పనిలో పడ్డాయి. ఇప్పుడు ఈ జాబితాలో మోటరోలా (Motorola) కూడా చేరింది. ఈ ఏడాది తన ఉత్పత్తులను మరింత మెరుగ్గా ఆవిష్కరించడానికి రంగం సిద్ధం చేస్తోంది. అయితే ఈసారి సొంతంగా కాకుండా, లెనోవా (Lenovo) తో జతకట్టింది. జనవరి 7 నుంచి తన ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ ను విడుదల చేయనుంది.
ట్విట్టర్ లో తాను విడుదల చేయబోయే ఫోన్ మోడల్ ను పోస్ట్ చేసింది మోటోరోలా. అయితే డిజైన్, కెమెరా వివరాలను మాత్రమే ఈ కంపెనీ బయటకు వెల్లడించింది. ఖచ్చితమైన వివరాలను ఇంకా చెప్పలేదు. ఈ ఫోన్ మోడల్ పేరు మోటరోలా ఎడ్జ్ 70 అల్ట్రా (Motorola edge 70 ultra) గా పేర్కొంది. ఫ్యాబ్రిక్, ఫినిష్డ్ రియర్ ప్యానెల్, స్లిమ్ జేజేల్స్, ప్లాట్ డిస్ ప్లే ను కలిగి ఉంది. ఇది పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, ఫ్లాగ్ షిప్ గ్రేడ్ పనితీరు కనబరుస్తుందని తెలుస్తోంది. ఇందులో అత్యంత ఆధునికమైన హార్డ్వేర్ కూడా ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
మైక్రో సైట్ లో ఉన్న సమాచారం ప్రకారం ఫోన్ కుడివైపున వాల్యూమ్ బటన్లు, పవర్ బటన్లను జత చేసింది. మరో బటన్ ఎడమవైపున ఉంది. కెమెరా లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను జత చేసింది. మోటరోలా తయారుచేసిన ఈ మోడల్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్ తో నడుస్తోంది. ఇందులో ఆరు కోర్లు 3.32 జిజిహెచ్ వద్ద, రెండు కోర్లు 3.89 జిజిహెచ్ వద్ద పనిచేస్తాయి. ఇది అడ్రినో 829 జిపియుతో అనుసంధానమై ఉంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత యుఐ తో పనిచేస్తుంది. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ కు దగ్గరగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 16gb రామ్ ఈ ఫోన్ సొంతం. మోటరోలా సిగ్నేచర్ కార్బన్, మార్టిని హాలీవుడ్ అనే రంగులలో ఈ ఫోన్ లభ్యమవుతుంది. 6.7 అంగుళాల 1.5 ఓఎల్ఈడి డిస్ప్లే, త్రిబుల్ కెమెరా సెట్ అప్ ఈ ఫోన్ లో ఉంది.. అయితే ధర గురించి మోటరోలా ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు.