Homeబిజినెస్Motorola Edge 70 Pro: Motorola కొత్త ఫోన్ రిలీజ్ డేట్ కన్ఫామ్.. ఇక రెడీగా...

Motorola Edge 70 Pro: Motorola కొత్త ఫోన్ రిలీజ్ డేట్ కన్ఫామ్.. ఇక రెడీగా ఉండండి..

Motorola Edge 70 Pro: Motorola కంపెనీ నుంచి కొత్త ఫోన్లు ఎప్పుడు వస్తాయని కొందరు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ కంపెనీకి చెందిన ఫోన్స్ ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పటికే రిలీజ్ అయిన మోటరోలా ఫోన్లకు మంచి ఆదరణ లభిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని కంపెనీ కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తుంది. ఇందులో భాగంగా మోటరోలా Edge 70 Pro గురించి ఇప్పటికే ప్రకటించింది. అయితే దీని రిలీజ్ డేట్ పై చాలా మందికి సందేహం ఉండేది. కానీ ఇప్పుడు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ ఫోన్ కొనేవారు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఈ ఫోన్ ఎప్పటికీ మార్కెట్లోకి వస్తుంది? ఇందులో ఉండే స్పెషల్ ఏంటి?

Motorola నుంచి ఇప్పటికే వచ్చిన ఎడ్జ్ 70 ఫ్యూజన్ మార్కెట్లో ప్రత్యేకంగా నిలుస్తోంది. అయితే ఈ సిరీస్లో త్వరలో ఎడ్జ్ 70 ప్రో రాబోతోంది. ఈ మొబైల్ లో 6.8 అంగుళాల AMOLED డిస్ప్లే ఉండనుంది. ఈ డిస్ప్లే 1.5 కే Resolution తో పనిచేస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ తో ఉండే ఇందులో 5200 nits వరకు బ్రైట్నెస్ లెవెల్ ఉండబోతుంది. అలాగే ఈ డిస్ప్లే రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 7i ఉండనుంది. దీంతో దుమ్ము, ధూళి నుంచి ఇది రక్షణగా ఉంటుంది. ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 8500 ప్రాసెసర్ ఉండడంతో వేగంగా పనిచేసుకునే వారికి సపోర్ట్ గా ఉంటుంది. అలాగే ఇందులో ఐదేళ్ల సెక్యూరిటీ అప్డేట్ తో పాటు మూడేళ్ల ఓఎస్ అప్గ్రేడ్ వరకు వారంటీ పొందవచ్చు. ఏఐ తో పాటు అదనపు ఫీచర్లు ఉండనున్నాయి.

ఈ మొబైల్ లో 50 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా ఉండనుంది. ఇది సోనీ LYT 710 క్వాలిటీతో పనిచేస్తుంది. 50 ఎంపీ ఫ్రంట్ కెమెరా తో పాటు వీడియో కాలింగ్ కోసం పనిచేస్తుంది. వీడియో రికార్డింగ్ చేసుకునే వారికి 4k Resolution నాణ్యత ఇవ్వనుంది. ఈ మొబైల్లో 6500 mAh బ్యాటరీ ఉండగా.. ఇది 90 వాట్ టర్బో పవర్ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే రెండు రోజుల వరకు బ్యాటరీ నిలువ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇందులో డాల్ఫి సౌండ్ తో పాటు బ్రైట్నెస్ అధికంగా ఉండే డిస్ప్లే ఉండడంతో యూత్ కు ఇది అనుగుణంగా ఉండనుంది.

అయితే ఈ మొబైల్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. ఏప్రిల్ 22వ తేదీన ఈ దీనిని అధికారికంగా లాంచ్ కానుంది. ఆ తర్వాత అందుబాటులో ఉండే తేదీని ప్రకటిస్తారు. ఈ కామర్స్ వెబ్ సైట్ల ద్వారా కొనుగోలు చేసేలా సిద్ధం చేస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version