Motorola Edge 70: కాలం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని చాలామంది భావిస్తారు. ఇందులో భాగంగా మార్కెట్లోకి వచ్చే కొత్త టెక్నాలజీని స్వీకరిస్తూ ఉంటారు. వీటిలో ముఖ్యంగా మార్కెట్లోకి వచ్చే కొత్త మొబైల్స్ ను చేస్తూ ఉంటారు. వినియోగదారులకు అనుగుణంగా ప్రముఖ మొబైల్స్ కంపెనీలు కూడా కొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తూ ఉంటాయి. ప్రముఖ మొబైల్ కంపెనీ Motorola మార్కెట్లోకి కొత్తగా Motorola Edge 70 అనే మొబైల్ ను నవంబర్ 5న తీసుకురాబోతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో విషయం తెలియడంతో చాలామంది ఈ ఫోన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపుతున్నారు. అయితే కంపెనీ అందించిన వివరాల ప్రకారం ఈ మొబైల్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
ఫోన్ కొనుగోలు చేయాలనుకునే ఎక్కువ శాతం వినియోగదారులు కెమెరా పని తీరుపై ఆసక్తి చూపుతారు. కొత్తగా వచ్చే ఈ మొబైల్ లో బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సల్ మెయిన్ తో పాటు అల్ట్రా వైట్ కెమెరాను అందిస్తుంది. అలాగే ముందు భాగం లోనూ 50 మెగా పిక్సెల్ తో కలిగి ఉంది. మీ మొబైల్ లో 7 జెన్ 4 ప్రాసకర్ను కలిగి ఉంది. ఇందులో 12 GB ర్యామ్ , 512 GB స్టోరేజ్ లభించనుంది. ప్రధానంగా ఈ మొబైల్ 6.7 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. చుట్టూ 1.5 కే పోలింగ్ ప్యానెల్ ను సెట్ చేశారు. భారత్ తో పాటు చైనాలోనూ ఈ మొబైల్ ను రిలీజ్ చేయనున్నారు.
భారత్లో రిలీజ్ చేసే ఈ మొబైల్ 5.99 ఎంఎం తో ప్రధాన ఆకర్షణగా ఉండనుంది. అలాగే ఇందులో 4,800 mah బ్యాటరీని కలిగి ఉండడంతో బ్యాటరీ బ్యాక్అప్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ బ్యాటరీ సిలికాన్ ది కావడంతో చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అలాగే ఈ మొబైల్ కొనుగోలు చేసిన వారికి 68 వాట్ వైర్డ్ చార్జింగ్, ఫిఫ్టీన్ వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉండే అవకాశం ఉంది. ఒకసారి చార్జింగ్ చేస్తే రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు ఆన్లైన్లో పేర్కొన్నారు.
అయితే ఈ మొబైల్ చైనాలో రూ.32,000 నుంచి రూ.36,000 వరకు ధరను నిర్ణయించారు. భారత్లో విడుదలయ్యే నాటికి ధరలు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఈ మొబైల్ ఫీచర్లు తెలియడంతో చాలామంది దీనిని కొనుగోలు చేయాలని ఆసక్తి చెబుతున్నారు. అంతేకాకుండా మోటోరోలా కంపెనీకి చెందిన మొబైల్స్ ఎక్కువగా ప్రజాధరణ పొందడంతో ఈ కొత్త మొబైల్ సేల్ బాగుంటుంది అని కంపెనీ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.