Homeబిజినెస్Motorola Edge 70 Max: ఏం ఫీచర్లు.. ఏం స్పెసిఫికేషన్స్.. ఈ ఫోన్ కొనకపోతే బాధపడుతారు..

Motorola Edge 70 Max: ఏం ఫీచర్లు.. ఏం స్పెసిఫికేషన్స్.. ఈ ఫోన్ కొనకపోతే బాధపడుతారు..

Motorola Edge 70 Max: భారతీయ స్మార్ట్‌ఫోన్ ప్రియులు మోటోరోలా (Motorola) కంపెనీ నుంచి రిలీజ్ అయ్యే మొబైల్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వినియోగదారులకుఅనుగుణంగా కంపెనీ సైతం కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా లేటేస్ట్ గా సరికొత్త ఫ్లాగ్‌షిప్ 5G మొబైల్‌ను పరిచయం చేసింది. ప్రీమియం ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ అధికారికంగా భారత మార్కెట్లోకి విడుదలైంది. పవర్‌ఫుల్ ప్రాసెసర్, బిగ్ బ్యాటరీ, అద్భుతమైన కెమెరా సెటప్‌తో వచ్చిన ఈ ఫోన్ పై బ్యాంకు ఆఫర్లు ఇచ్చారు. ఫోన్ కొనుగోలు చేసే ముందు ఈ విషయం తెలుసుకోవాలి. ఆ వివరాల్లోకి వెళితె..

Motorola కంపెనీ నుంచి ‘Edge 70 Max ’పేరుతో సరికొత్త ప్రీమియం ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్లో క్వాల్కమ్ కంపెనీకి చెందిన అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్ యూజ్ చేసేవారికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే AI టాస్క్‌లను ఎలాంటి లాగ్ లేకుండా స్మూత్‌గా రన్ చేస్తుంది. దీనికి తోడుగా ఇందులో 12GB వరకు RAM, 256GB UFS 4.1 స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది.

ఈ కొత్త ఫోన్ లో 6.8 అంగులాల క్వాడ్ HD ప్లస్ ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేయడం వల్ల స్క్రోలింగ్ స్మూత్ గా ఉంటుంది. అలాగే 7,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ కలిగి ఉండడంతో ఎండలో సైతం స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా, స్క్రీన్‌ రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్, నీటి చుక్కలు పడినా టచ్ పనిచేసేలా ‘వాటర్ టచ్’ ఫీచర్ కూడా ఇచ్చారు.

ఈ ఫోన్ యొక్క ప్రధాన ఆకర్షణ బ్యాటరీ కెపాసిటీ. ఇందులో ఏకంగా 7100 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ ని అమర్చారు. దీనిని ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే దాదాపు 58 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ భారీ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడం కోసం 90 వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అంతేకాదు, ఇది 25W వైర్‌లెస్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.

కెమెరా విషయానికొస్తే.. ఇందులో 50MP సోనీ లైటియా ప్రధాన కెమెరా ఉంది. దీనితో పాటు 8MP అల్ట్రా వైడ్ ప్లస్ మాక్రో లెన్స్ అందించారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP హై రెజల్యూషన్ కెమెరా అమర్చారు. ఈ ఫోన్ రూ. 54,999 ప్రారంభ ధరతో ఉండనుంది. బ్యాంక్ డిస్కౌంట్లు మరియు లాంచ్ ఆఫర్ల కింద రూ. 5,000 వరకు తగ్గింపు లభిస్తుంది. జూలై 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి Flipkart , మోటోరోలా అధికారిక వెబ్‌సైట్ లో దీనిని విక్రయించనున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular