Motorola Edge 70 Fusion Review: Motorola నుంచి మార్కెట్లోకి వచ్చే మొబైల్ కు ఎంతో ఆదరణ ఉంటాయి. ఫ్లాగ్ షిప్ తో పాటు నాణ్యమైన కెమెరా, మెరుగైన బ్యాటరీ ఉండడంతో చాలామంది ఈ మొబైల్స్ కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇటీవల ఈ కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చిన Motorola Edge 70 fusion ప్రత్యేకతను సాధించుకుంటుంది. దీని తర్వాత మోటరోలా ఎడ్జ్ 70 ప్రో వచ్చినప్పటికీ ఫ్యూజియన్ గురించి ఎక్కువగా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే ఇందులో ఉండే ఫీచర్స్, డిస్ప్లే యూత్ తో పాటు అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఇందులో ఉండే స్పెషల్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
Motorola నుంచి Fusion సిరీస్లో వచ్చిన మొబైల్స్ కంటే 70 Edge Fusion లో ఉండే ఫీచర్స్ మెరుగ్గా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మొబైల్ లో 6.8 అంగుళాల AMOLED డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే కు రక్షణగా కార్నింగు గొరిల్లా గ్లాస్ 7i ఉండడంతో దుమ్ము, దూళి నుంచి కాపాడుకోవచ్చు. ఈ డిస్ప్లే 144 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. అలాగే ఇది HDR+ కు సపోర్టు ఉండటంతో చాలామంది ఈ డిస్ప్లే కు ఆకర్షితులు అవుతున్నారు. ఆండ్రాయిడ్ 16 వెర్షన్ లో ఉండే ఈ మొబైల్ లో మూడు సంవత్సరాల ఆపరేటింగ్ సిస్టం అప్డేట్ ను అందిస్తున్నారు. అలాగే ఇందులో Qualcomm స్నాప్ డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్ ఉండనుంది. ఇందులో 8 GB వరకు రామ్ సపోర్ట్ చేయనుంది. 256 స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్ లో కెమెరా పనితీరు మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది.
మోటరోలా ఎడ్జ్ 70 Fusion మొబైల్ లో 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండనుంది. 13 మెగాపిక్ సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ పనిచేస్తుంది. 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పాటు వీడియో కాలింగ్ కోసం పనిచేస్తుంది పగలు, రాత్రి అనే సమయం లేకుండా ఎలాంటి సమయంలోనైనా నాణ్యమైన ఫోటోలను అందించడానికి ఈ కెమెరాలు ఉపయోగపడతాయి. ఈ మొబైల్ లో బ్యాటరీ వ్యవస్థ బలంగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో 7000 mAh బ్యాటరీ ఉండనుంది. ఈ బ్యాటరీ 68 W ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేయనుంది. సూపర్ స్లిమ్ డిజైన్ తో కూడిన ఈ మొబైల్ మిగతా వాటి కంటే ఆకర్షణీయంగా కల్పిస్తోంది. అంతేకాకుండా అందుబాటు ధరలో ఉండడంతో దీనిని మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ లో ఈ మొబైల్ ధర రూ.24,999 తో విక్రయిస్తున్నారు.
