Motorola Edge 40: మొబైల్ మార్కెట్లో దశాబ్దాలుగా Motorola కంపెనీ వివిధ రకాల డివైస్లను అందిస్తూ వస్తుంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ తో పాటు ఫీచర్లను అప్డేట్ చేస్తూ.. యూత్ ను ఆకట్టుకునే విధంగా కొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకువస్తుంది. అయితే ఈ కంపెనీ లేటెస్ట్ గా మెరుగైన కెమెరా తోపాటు బలమైన బ్యాటరీ ఉండే ఓ కొత్త మొబైల్ తీసుకురావడానికి సిద్ధమైంది. దీనికి సంబంధించిన వివరాలు ఆన్లైన్లో ప్రత్యక్షం కావడంతో చాలామంది దీని గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఈ ఫోన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
Motorola కొత్తగా Edge 40 పేరుతో మొబైల్ తీసుకురావాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఈ మొబైల్ డిజైన్తో ఆకట్టుకునే అవకాశం ఉంది. వంపులు తిరిగిన అంచులు, వీగన్ లెదర్ బ్యాక్ వంటి పానెల్ ఆకర్షించనుంది. దీనికి ప్రత్యేక క్లాసి టచ్ ఉండనుంది. దీంతో ఇది చేతిలో పట్టుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. ప్రమాదవశాత్తు కూడా జారిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ మొబైల్ డిస్ప్లే ఆకట్టుకునే విధంగా ఉండనుంది. ఇందులో 6.55 అంగుళాల HD+ POLED డిస్ప్లేను అమర్చనున్నారు. ఇది కావాల్సిన రంగులను ప్రదర్శిస్తుంది. మూవీస్ చూడాలని అనుకునే వారికి ఇది బాగా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ స్క్రీన్ 144 Hz రిఫ్రిష్ రేట్ తో ఉండడంతో స్క్రోలింగ్ తో పాటు యానిమేషన్, గేమింగ్ కు బాగా పనిచేస్తుంది. పగలు, రాత్రి అని తేడా లేకుండా ఏ సమయంలో నైనా అద్భుతమైన స్క్రీన్ బ్రైట్నెస్ కనిపిస్తోంది.
ఇందులో మీడియా టెక్ dimensity 8020 ప్రాసెసర్ను అమర్చనున్నారు. ఈ చిప్ సెట్ రోజువారి మొబైల్ ఉపయోగించేవారికి బాగా పనిచేస్తుంది. కాలింగ్ తో పాటు వీడియో కాలింగ్ లేదా ఇతర అవసరాలకు ఫోన్ యూజ్ చేసే వారికి ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. అలాగే ఇందులో 8GB Ram ను అమర్చనున్నారు. 256 GB స్టోరేజ్ ఉండనుంది. దీంతో ఫోటోలు, వీడియోలు కావాల్సినవన్నీ స్టోర్ చేసుకోవచ్చు.
ఈ మొబైల్లో కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇందులో రెండు నాణ్యమైన ఫోటోలు తీసి వివరాలు ఉన్నాయి. 50 MP మెయిన్ కెమెరా పనిచేయగా..13 MP అల్ట్రా వేట్ కెమెరా వైడ్ యాంగిల్ షాట్స్ తీస్తుంది. అలాగే 32 MP సెల్ఫీ కెమెరా కూడా అద్భుతమైన ఫోటోగ్రఫీని అందిస్తుంది. అలాగే 4k వీడియోలు కావాలనుకునే వారికి కూడా ఈ కెమెరా అనుకూలంగా ఉంటుంది. ఈ మొబైల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బ్యాటరీ వ్యవస్థ. ఇందులో 4400 mAh బ్యాటరీని చేర్చారు. ఇది 68 వాట్ ఫాస్టెస్ట్ చార్జింగ్ తో సపోర్టుగా ఉంటుంది. దీంతో రోజంతా మొబైల్ ఉపయోగించినా చార్జింగ్ అనుకూలంగా ఉంటుంది. అలాగే డౌన్ టైం కూడా తక్కువగా ఉంటుంది. ఇక ఇందులో యూఎస్బీ టైప్ సి వంటి వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లను అమర్చారు.