Homeబిజినెస్Motorola Edge 2026: ప్రీమియం ఫీచర్లు.. Motorola కొత్త ఫోన్ గురించి తెలుసా..

Motorola Edge 2026: ప్రీమియం ఫీచర్లు.. Motorola కొత్త ఫోన్ గురించి తెలుసా..

Motorola Edge 2026: Motorola తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ Edge ను విస్తరిస్తూ సరికొత్త ఫోన్ ను ఆవిష్కరించింది. Motorola Edge 2026 మోడల్‌ను ఆకర్షణీయమైన ఫీచర్లతో పాటు పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే పరంగా వినియోగదారులను ఆకట్టుకునేలా ఉందవి. ఈ ఫోన్ మిడ్ రేంజ్ విభాగంలో గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమైంది. ఈ మొబైల్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితె..

మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్ 6.3-అంగుళాల అద్భుతమైన డిస్‌ప్లేతో వస్తోంది. 1.5 కె రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండటం వల్ల గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది. మోటోరోలా ఎడ్జ్ సిరీస్ ప్రత్యేకత అయిన స్లిమ్ , ప్రీమియం డిజైన్ ఇందులో కూడా కనిపిస్తుంది. ఇది చేతిలో పట్టుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

ఈ ఫోన్ గుండెకాయ వంటి చిప్‌సెట్ విషయానికొస్తే, ఇందులో లేటెస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7450 SoCని పొందుపరిచారు. ఇది అద్భుతమైన మల్టీ టాస్కింగ్ సామర్థ్యాన్ని 5G కనెక్టివిటీని అందిస్తుంది. గేమర్స్ కోసం మరియు భారీ అప్లికేషన్లను వాడే వారి కోసం ఈ ప్రాసెసర్ తక్కువ శక్తిని వినియోగించుకుంటూ ఎక్కువ వేగాన్ని అందిస్తుంది.

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఇందులో ట్రపుల్ కెమెరాను అమర్చారు. సోని లిటియా 710 సెన్సార్ లో కూడిన 50 మెగా పిక్సెల్ రియర్ కెమెరాను అమర్చారు. అల్ట్రావైడ్ లెన్స్ 50 మెగా పిక్సెల్ తో పని చేస్తుంది. 10 మెగా పిక్సెల్ తో టెలిఫొటో కెమెరా కూడా ఉంది. సెల్ఫీ కోసం 50 మెగా పిక్సెల్ ను ఉపయోగించారు. అత్యంత స్పష్టమైన, షార్ప్ చిత్రాలను తీయడంలో పాటు అదనంగా ఉన్న అల్ట్రా-వైడ్ మరియు మాక్రో సెన్సార్ల వల్ల వైవిధ్యమైన యాంగిల్స్‌లో ఫోటోలను క్యాప్చర్ చేయవచ్చు. రాత్రిపూట ఫోటోగ్రఫీ కోసం ప్రత్యేకమైన నైట్ మోడ్ ఫీచర్లను కూడా ఇందులో మెరుగుపరిచారు.

దీర్ఘకాలం పాటు ఫోన్ వాడకానికి వీలుగా ఇందులో శక్తివంతమైన 5,000 mAh బ్యాటరీని అమర్చారు. దీనికి తోడు మోటోరోలా అందించే 15 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వల్ల, నిమిషాల్లోనే బ్యాటరీని గణనీయంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫోన్ దుమ్ము, ధూళి తో పాటు నీటి నంచి రక్షణ పొందేందుకు IP68 రేటింగ్ ను పొంది ఉంది. సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ బాగుండటం వల్ల, బ్యాటరీ లైఫ్ మరింత మెరుగ్గా ఉంటుంది.

మోటోరోలా ఎడ్జ్ 2026 మోడల్ మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఆకర్షణీయమైన ధరలతో అమెరికా మార్కెట్లోకి వచ్చింది. దీనిని రూ. 57,000 తో విక్రయిస్తున్నారు. పాంటోన్ మార్టిని ఆలివ్ కలర్ వేలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ లో 5జీ కనెక్టివిటీ, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్, వంటి ఫీచర్లు ఉన్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular