Cars with sunroof: ఒకప్పుడు కారు కొనాలంటే ఖరీదైన వ్యవహారం. కానీ నేడు మిడిల్ క్లాస్ కు చెందిన వారు కార్లు విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. కంపెనీలు సైతం సామాన్యులను బేస్ చేసుకొని వివిధ మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. మైలేజ్ ఎక్కువ ఇచ్చే కార్లతో పాటు తక్కువ ధరకు అందిస్తున్నాయి. ఇదే సమయంలో అప్డేట్ ఫీచర్స్ ను సైతం తక్కువ ధర కార్లకు అందిస్తున్నాయి. సన్ రూప్ కార్లు అంటే ధనవంతులకు మాత్రమే ఉంటాయనే ఫీలింగ్ ఉండేది. కానీ కొన్ని కంపెనీలు మిడిల్ ఎస్ యూవీలను సన్ రూప్ తో డిజైన్ చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. దీంతో చాలా మంది సన్ రూప్ కార్లపై మనసు పెడుతున్నారు. సన్ రూప్ పీచర్స్ కలిగి అతి తక్కువ ధరకు వచ్చే కార్లు ఏవో తెలుసుకుందాం..
హ్యాందాయ్ ఎక్స్ టర్:
హ్యాందాయ్ నుంచి రిలీజ్ అయిన ఎక్స్ టర్ బాగా పాపులారిటీ సాధించుకుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగిన ఇది మాన్యువల్ ఏఎంటి గేర్ బాక్స్ ను కలిగి ఉంది. సీఎన్ జీ వేరియంట్ ను కూడా కలిగిన ఈ కారును రూ.8.0 లక్షలకే విక్రయిస్తున్నారు. ఇది చిన్న ఎస్ యూవీ అయినా సన్ రూఫ్ తో కూడుకొని ఉంది.
టాటా పంచ్:
టాటా కంపెనీ నుంచి ది బెస్ట్ మోడల్ గా నిలిచిన పంచ్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. పెట్రోల్ తో పాటు సీఎన్ జీ ఎంపికను కూడా చేసుకోవచ్చు. రూ.8.35 లక్షలతో విక్రయించే ఈ కారు సన్ రూప్ తో అందుబాటులో ఉంది.
మహీంద్రా XUV300:
ఎస్ యూవీలను తీసుకురావడంలో మహీంద్రా ముందుంటుంది. అయితే ఈ కంపెనీ నుంచి తక్కువ ధరకే సన్ రూఫ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. మహీంద్రా XUV300 డబ్లూ 4లో అదనంగా సన్ రూప్ ను జోడించింది. 1.2 లీటర్ టర్బో చార్జ్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ను కలిగిన దీనిని 8.66 లక్షలతో విక్రయిస్తున్నారు. ఈ కారును సన్ రూప్ లో ది బెస్ట్ గా నిలిచింది.