https://oktelugu.com/

Zomato: జీతమే లేని ఉద్యోగం.. అయినా 10 వేల మంది దరఖాస్తు..

ఇటీవల యువత భిన్నమైన రెజ్యూమ్స్‌తో కంపెనీలను ఆకట్టుకుంటోంది. ఉద్యోగం కోసం సృజనాత్మకంగా ఆలోచిస్తోంది. ఇక ఇటీవలో ఓ యువతి తనకు ఉద్యోగం ఇవ్వండి జీతం అవసరం లేదని సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 22, 2024 / 08:47 AM IST

    Zomato

    Follow us on

    Zomato: ఉద్యోగ నోటిఫికేషన్‌ అనగానే.. అర్హతలు ఏంటి అనేది మొదట చూస్తారు. తర్వాత వేతనం ఎంత అనేది పరిశీలిస్తారు. ఇవి రెండూ ఓకే అనుకున్న తర్వాతనే మిగతా దరఖాస్తు విధానం, పరీక్ష విధానం, ఫీజు వివరాలు తెలుసుకుంటారు. ఇక ఎవరైనా ఉద్యోగం చేస్తున్నామంటే.. మొదట అడిగే ప్రశ్న ఏం ఉద్యోగం.. జీతం ఎంత. కానీ ఓ ప్రముఖ కంపెనీ యజమాని ఇటీవల ఓ ప్రకటన చేశారు. చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ స్థానంలో పనిచేసేందుకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నాడు. ఈ ఉద్యోగానికి జీతం ఉండదని, ఉద్యోగంలో చేరినవారే రూ.20 లక్షలు ఇవ్వాలని ప్రకటించారు. కంపెనీళ్లో ఉద్యోగం చేసేవారే భిన్నంగా ఆలోచిస్తున్నపుడు తాము కూడా భిన్నంగా ఆలోచించాలనుకున్నాడు. అందుకే ఇలా ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటన చూసి ఇదేం ఉద్యోగ ప్రకటనరా అనుకుంటారని అందరూ భావించారు. కానీ, జీతమే లేని ఉద్యోగానికి 24 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇంతకీ ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇచ్చింది జొమాటో సీఈవో దీపీందర్‌ గోయల్‌. ఉద్యోగానికి వచ్చిన దరఖాస్తులు చూసి ఆయనే షాక్‌ అయ్యారు. ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్టు చేశారు.

    ఉద్యోగం ఏంటంటే..
    జొమాటోలో చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ స్థానంలో నియామకం కోసం సీఈవో ఇటీవల ప్రకటన విడుదల చేశారు. నియమానికి గురుగ్రామ్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుందని ప్రకటించారు. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్న కోరిక, జీవతంలో ఉన్నతంగా ఎదగాలనే తపన ఉన్నవారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నాడు. దీనికి ఎక్స్‌పీరియన్స్‌ కూడా అవసరం లేదని తెలిపారు. అంతేకాకుండా ఉద్యోగంలో చేరిన తర్వాత జొమాటో, బ్లింకిట్, హైపర్‌ ప్యూర్, జొమాటో ఆధ్వర్యంలోని ఫీడింగ్‌ ఇండియా ఎన్జీవో సంస్తల వృద్ధి కోసం పనిచేయాల్సి ఉంటుందని వివరించారు.

    రూ.20 లక్షల విరాళం ఇవ్వాలి..
    ఇంతే కాదు.. చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తికి మొదటి ఏడాది జీతం ఉండదు. ఆ ఉద్యోగి రూ.20 లక్షలు ఫీడింగ్‌ ఇండియాకు విరాళంగా కూడా ఇవ్వాలి. అయితే రెండో ఏడాది నుంచి రూ.50 లక్షలకు తగ్గకుండా వేతనం ఉంటుంది. ఈ విషయాన్ని గోయల్‌ స్పష్టం చేశారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేవారు రెజ్యూమ్‌ పంపాల్సిన అవసరం లేదు. 200 పదాల్లో తమ గురించి తెలియజేస్తూ దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది.

    భిన్నమైన నోటిఫికేషన్‌..
    నిరుద్యోగులు, ఉద్యోగాల కోసం భిన్నంగా రెజ్యూమ్‌లు, దరఖాస్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో జొమాటో సీఈవో గోయల్‌ కూడా భిన్నంగా ఉద్యోగ ప్రకటన ఇవ్వాలనుకున్నట్లున్నారు. అందుకే భారీ వేతనంతో కూడిన ఉద్యోగ ప్రకటనను ఇలా భిన్నంగా ప్రకటించారు. ఈ ప్రకటనను నెటిజన్లు, నిరుద్యోగులు ఆసక్తిగా గమనిస్తున్నారు. జాబ్‌ నోటిఫికేషన్‌ ఇలా కూడా ఇస్తారా అని ఆశ్చర్యపోతున్నారు.