
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు ప్రయోజనం చేకూరేలా ఇప్పటికే పలు స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులు ఈ స్కీమ్స్ లో చేరడం ద్వారా కేంద్రం అందించే బెనిఫిట్స్ ను పొందడం సాధ్యమవుతుంది. కేంద్రం రైతుల కొరకు పీఎం కిసాన్ స్కీమ్ తో పాటు పీఎం కిసాన్ మాన్ ధన్ పథకంను అమలు చేస్తోంది. ఈ రెండు స్కీమ్స్ ద్వారా రైతులు ఏడాదికి ఏకంగా రూ.42 వేలు పొందవచ్చు.
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా 6,000 రూపాయలు జమ చేస్తోంది. రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాలో ఈ నగదు జమవుతూ ఉండటం గమనార్హం. కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్ పేరుతో కేంద్రం మరో స్కీమ్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్ ద్వారా నెలకు 3 వేల రూపాయల చొప్పున రైతులకు ఏకంగా 36వేల రూపాయలు లభిస్తాయి.
ఈ విధంగా రెండు స్కీమ్ ల ద్వారా ఏకంగా 42వేల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్‌లో చేరాలని భావించే రైతులు 18 ఏళ్ల వయసులో చేరితే నెలకు రూ.55 చొప్పున 30 ఏళ్ల వయసులో చేరితే రూ.110 చొప్పున 40 ఏళ్ల వయసులో చేరితే నెలకు రూ.200 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ లో చేరడం ద్వారా 60 సంవత్సరాల తర్వాత నెలకు 3,000 రూపాయల చొప్పున పొందే అవకాశం ఉంటుంది.
రైతులు ఈ రెండు స్కీమ్స్ లో చేరడం వల్ల రైతులు భారీ మొత్తంలో బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. సమీపంలోని వ్యవసాయ అధికారులను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్స్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.