Mini Ac: ఓ వైపు వర్షాలు పడుతూనే మరోవైపు ఎండ వేడి భయపెడుతోంది. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లాలంటే జనం భయపడుతున్నారు. ఇంట్లో ఉన్నంత సేపు వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ తరుణంలో చల్లదనం కోసం ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు కొనుగోలు చేస్తున్నారు. వేసవి ప్రారంభం నుంచే ఎండ వేడి పెరగడంతో వీటికి డిమాండ్ పెరుగుతున్నారు. అయితే ఎన్ని ఫ్యాన్లు, కూలర్లు ఉన్నా ఏసీలకు మించిన చల్లదనాన్ని ఇవ్వవు .కానీ ఇప్పుడు ఓ టేబుల్ ఫ్యానస్ ఏసీలు ఇంటిని చల్లబరుస్తుంది. నిమిషాల్లో ఇల్లును మంచు ప్రదేశంలా చేస్తుంది. ఇంతకీ ఆ ఫ్యాన్ ఏదంటే?
నేటి కాలంలో నార్మల్ ఏసీని కొనుగోలు చేయాలంటే రూ.30 నుంచి రూ.40 వేల వరకు అవుతుంది. మిడిల్ క్లాస్ పీపుల్స్ కు ఇది ఖర్చుతో కూడుకున్న పని. అందువల్ల కూలర్లతోనే పరిమితం అవుతున్నారు. ఈ తరుణంలో చాలా మంది ఫోర్టబుల్ ఏసీల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఫోర్టబుల్ ఏసీల ధర తక్కువగా ఉండి మంచి చల్లదనాన్ని ఇస్తుంది. ఈ కోవలోనే ఓ టేబుల్ ఫ్యాన్ ఏసీ రేంజ్ లో చల్లదనాన్ని ఇస్తుంది.
స్ల్పింకర్ టేబుల్ ఫ్యాన్ గురించి ఇటీవల తీవ్ర చర్చ సాగుతోంది. ఇది చూడ్డానికి టేబుల్ ఫ్యాన్ లాగే కనిపించినప్పుటికీ వాటర్ తో నడుస్తుంది. ఆమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ లో దీనిని అమ్మకానికి పెట్టారు. ఈ ఫ్యాన్ కు స్ప్లింకర్ పైపులు అమర్చబడి ఉంటాయి. వీటి ద్వారా వాటర్ వచ్చి ఫ్యాన్ కూలింగ్ అవుతుంది. దీనిని రూ.1500 కు కొనేయచ్చు. అయితే ఇప్పటికే టేబుల్ ఫ్యాన్ ఉన్నవారు వాటర్ పైపులను అమర్చుకోవచ్చు.
పెద్ద ఏసీలు కొనలేని వారు ఈ ఫ్యాన్ కొనుక్కొని చల్లబడవచ్చు. అంతేకాకుండా చిన్న ఇంట్లో ఈ ఫ్యాన్ నిమిషాల్లో చల్లబడుతుంది. మిడిల్ క్లాస్ పీపుల్స్ కు ఇది అనుగుణంగా ఉంటుంది. అయితే షాప్ లో ఉండేవారు సైతం దీనిని కొనుగోలు చేయొచ్చు. తక్కువ ధరకు అందించే దీని కోసం చాలా మంది వినియోగదారులు సెర్చ్ చేస్తున్నారు.