https://oktelugu.com/

Millionaire Nikhit Kamat : సంపాదనలో సగభాగం (రూ.14వేల కోట్లు) విరాళం.. మిలియనీర్ దానం వెనుక కదిలించే స్టోరీ

కార్పొరేట్ దిగ్గజం, మిలియనీర్ నిఖిత్ కామత్ తన సంపాదనలో సగభాగం అంటే రూ.14 వేల కోట్లు సమాజ సేవకే ఉపయోగిస్తున్నట్లు ప్రకటించారు.

Written By:
  • NARESH
  • , Updated On : June 9, 2023 / 02:50 PM IST
    Follow us on

    Millionaire Nikhit Kamat : బతకడానికి డబ్బును అందరూ సంపాదిస్తారు. కొందరు ఎక్కువ.. తక్కువ.. తేడాతో ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. అయితే కార్పొరేట్ రంగంలో దూసుకుపోతున్న చాలా మంది ఎంత డబ్బు వచ్చినా ఇతరులకు దానం చేయడానికి కొందరికి మనసు రాదు. కానీ ఇంకొందరు మాత్రం ప్రజా సేవనే పరమావధిగా భావిస్తారు. భారత్ కు చెందిన చాలా మంది బడా వ్యాపారవేత్తలు ఇప్పటి వరకు తాము సంపాదించిన దాంట్లో ఎంతో కొంత విరాళంగా ఇచ్చారు. అయితే అజిత్ ప్రేమ్ జీ, శివనాడార్ లో తమ సంపాదనలో సగం కంటే ఎక్కువగా దానధర్మాలు చేశారు. ఇప్పుడు ఈ కోవలోకి మరో భారతీయుడు చేరాడు. కార్పొరేట్ దిగ్గజం, మిలియనీర్ నిఖిత్ కామత్ తన సంపాదనలో సగభాగం అంటే రూ.14 వేల కోట్లు సమాజ సేవకే ఉపయోగిస్తున్నట్లు ప్రకటించారు.

    జేరోదా సంస్థ కో ఫౌండర్ నిఖిల్ కామత్ పేరు మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి సుపరిచితమే. గడిచిన దశాబ్ద కాలంలో ఆయన తనదైన ముద్ర వేశాడు. జరోధా పేరిట అన్లైన్ ట్రేడింగ్ ఫ్లాట్ఫామ్ కు సహ వ్యవస్థాపకుడిగా ఉన్నాడు. ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగంలో జరోధ ఒక విప్లవమనే చెప్పొచ్చు. జరోధ కు వచ్చిన ఆదాయంతో నిఖిల్ కామత్ మిలియనీర్ అయ్యాడు. నిఖిత్ కామత్ ప్రస్తుతం సంపాదన రూ.28 వేల కోట్లు. 35 ఏళ్ల వయసులోనే బిగ్ షాట్ లో చేరి సంచలనం సృష్టించారు. 17 ఏళ్ల వయసులోనే మార్కెట్ రంగంలో ప్రవేశించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగాడు.

    మార్కెటింగ్ లో దూసుకుపోతున్న తనకు నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించడం పెద్ద విషయం కాదు. కానీ అతనికి అది తృప్తి నివ్వలేదు. ఇప్పటి వరకు అజీమ్ ప్రేమ్ జీ, కిరణ్ మజుందార్ షా లు చేసిన సాయంతో ఇంప్రెస్ అయ్యాడు. వారితో సమానంగా తన పేరును చూసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంతో తనకు వచ్చిన ఆదాయాన్ని ‘ ది గివింగ్ ఫ్లెడ్జ్’ అనే ఫౌండేషన్ కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. అంటే రూ.28 కోట్లలో రూ.14 వేల కోట్లు దానం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ఎంతో మందికి సహాయంగా నిలుస్తుందని అనుకుంటున్నట్లు నిఖిత్ తెలిపాడు.

    ‘గివింగ్ ఫ్లెడ్జ్’ అనే సంస్థను 2010లో బిల్ గేట్స్, వారెన్ బఫెట్ లు కలిసి స్థాపించారు. మొదట వీరు పెద్ద మొత్తంలో విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది మిలియనీర్స్ తమ సంపాదనలో పెద్ద మొత్తాన్ని ఇస్తున్నట్లు ప్రకటించి ఈ సంస్థకు విరాళంగా ఇస్తూ ఉంటారు. ఈ సంస్థకు వచ్చిన సొమ్ముతో విద్య, ఆరోగ్యం, వాతావరణ మార్పులకు సంబంధించి అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. కొర్పొరేట్ వ్యక్తులు ముందుగా ప్రకటించి.. ఆ తరువాత ఈ సంస్థకు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది.