MG Windsor EV : ఎంజీ మోటార్ తాజాగా విడుదల చేసిన విండ్‌సర్ ప్రో కోసం కేవలం 24 గంటల్లోనే 15,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు వచ్చాయని ప్రకటించింది. కొత్త ఎంజీ విండ్‌సర్ ప్రోను మే 6, 2025న రూ.17.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేశారు. అయితే, ఈ ప్రారంభ ధర మొదటి 8,000 మంది కస్టమర్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ఊహించని స్పందన రావడంతో ప్రారంభ ధర లిమిటెడ్ టైం మాత్రమే అందుబాటులో ఉంచారు. ఇప్పుడు బుక్ చేసుకునే కొనుగోలుదారులు ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది.
ఇప్పుడు MG విండ్‌సర్ ప్రో ధర ఫిక్స్‌డ్ బ్యాటరీ కోసం రూ.18.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఇదిలా ఉండగా, బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) ధర కూడా మొదటి 8,000 మంది కొనుగోలుదారుల కోసం ఉన్న రూ.12.50 లక్షలు + కిలోమీటరుకు 4.5 నుండి రూ.13.09 లక్షలు + రూ.4.5కిలోమీటరుకు పెరిగింది.
Also Read : ఈ కారులో వెళ్తే విమానంలో వెళ్ళినట్లే..
విండ్‌సర్ ఈవీ ప్రో రేంజ్, స్పీడ్
కొత్త విండ్‌సర్ ఈవీ ప్రో MG ZS EV వలె 52.9 కిలో వాట్స్ పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 449 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కారు ఫ్రంట్ వీల్ కు పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ (PMS) మోటార్ అమర్చబడి ఉంది. ఇది 134 bhp పవర్, 200 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 170 కిలోమీటర్లు. విండ్‌సర్ ఈవీ ప్రో కేవలం 8.6 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
విండ్‌సర్ ఈవీ ప్రో ఫీచర్లు
పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో పాటు అప్‌డేటెడ్ విండ్‌సర్ ఈవీ ప్రో ఇప్పుడు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్‌ను కలిగి ఉంది. ఇందులో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ వంటి ఫంక్షన్‌లు ఉన్నాయి. విండ్‌సర్ ఈవీ ప్రో అనేక ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంది. వాటిలో 15.6-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్ స్క్రీన్, ముందు వైపు వెంటిలేటెడ్ సీట్లు, 135 డిగ్రీల వంపు తిరిగే వెనుక సీట్లు, 9 స్పీకర్లతో కూడిన ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ ఉన్నాయి.
Also Read : ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌లో మరో సెన్సేషన్.. క్రెటా, పంచ్‌లకు చుక్కలే