Homeబిజినెస్MG Comet EV price in India: దేశంలో అత్యంత సరసమైన కారు.. క్యూ కడుతున్నారు.....

MG Comet EV price in India: దేశంలో అత్యంత సరసమైన కారు.. క్యూ కడుతున్నారు.. ధర ఎంతంటే..

MG Comet EV price in India: భారతదేశంలో ప్రస్తుతం EV ల హవా సాగుతోంది. కొత్తగా కారు కొనాలని అనుకునేవారు ఈ వేరియంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో కొన్ని కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరసమైన ధరలో కార్లను అందిస్తున్నాయి. వీటిలో MG Motors కంపెనీ నుంచి రిలీజ్ అయిన విద్యుత్ కారు అందరినీ ఆకర్షిస్తోంది. మిగతా కార్లకంటే దీని ధర బడ్జెట్ కు అనుగుణంగా ఉండడంతో దీని కోసం క్యూ కడుతున్నారు. ఇంతకీ దీని ధర ఎంతంటే?

MG కంపెనీ నుంచి ‘కామెట్ EV’ 2023లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అప్పటి నుండి పట్టణ ప్రయాణాలకు ఒక స్మార్ట్ ఎంపికగా నిలిచింది. గత ఏడాది ఈ సంస్థ ‘బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్’ (BaaS) వేరియంట్‌ను పరిచయం చేయడం ద్వారా దీనిని మరింత అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 4.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉండటంతో దేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అయితే తాజాగా టాటా మోటార్స్ తన ‘Tiago.ev’ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మరింత తక్కువ ధరకే ప్రారంభించడంతో, ఈ విభాగంలో పోటీ మరింత పెరిగింది.

అయితే ఈ కారులో 17.3 kWh బ్యాటరీ ప్యాక్ అమర్చబడి ఉంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 41 bhp పవర్, 110 Nm టార్క్‌ను అందిస్తుంది. ARAI క్లెయిమ్ ప్రకారం.. దీనిని ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది, ఇది రోజువారీ సిటీ ప్రయాణాలకు సరిపోయే ఈ కార ఎకో, నార్మల్ , స్పోర్ట్స్ అనే మూడు డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అలాగే 3.3 kW ఛార్జర్‌తో సుమారు 7 గంటల్లో 0 నుండి 100% ఛార్జ్ అవుతుంది.

ఈ బుజ్జి కారు కాంపాక్ట్ పరిమాణంలో ఉన్నప్పటికీ.. దీని క్యాబిన్ మాత్రం ఆధునిక ఫీచర్లతో కలిగి ఉంది. ఇందులో 10.25 అంగుళాల డ్యూయల్ డిస్‌ప్లే సెటప్ ఉంది. ఇది ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తో పాటు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పనిచేస్తుంది.వీటిలో పాటు ఇందులో వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వాయిస్ కమాండ్లు, డిజిటల్ కీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. భద్రత కోసం రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ABS విత్ EBD వంటి ప్రామాణిక భద్రతా ఫీచర్లను కూడా సంస్థ అందించింది.

MG కామెట్ EVకి సంబంధించి BaaS ప్రోగ్రామ్ కింద వినియోగదారులు కారును తక్కువ ధరకే కొనుగోలు చేసి, కిలోమీటరుకు రూ. 2.5 నుండి రూ. 3.2 మధ్య బ్యాటరీ అద్దె చెల్లించాల్సి ఉంటుంది. బ్యాటరీతో కలిపి లభించే వేరియంట్ల ధరలు సుమారు రూ. 7.35 లక్షల నుండి రూ. 7.63 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటాయి. 4-సీటర్ మైక్రో-EV విభాగంలో పట్టణ ట్రాఫిక్‌లో సులభంగా దూసుకెళ్లడానికి ఇది ఒక అద్భుతమైన వాహనం.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version