Homeబిజినెస్Maruti Wagon R Bio Flex Fuel: Maruti ఫ్లెక్సీ ఫ్యూయెల్ ధర ఇదే.. అఫీషియెల్...

Maruti Wagon R Bio Flex Fuel: Maruti ఫ్లెక్సీ ఫ్యూయెల్ ధర ఇదే.. అఫీషియెల్ అనౌన్స్..

Maruti Wagon R Bio Flex Fuel: భారత ఆటోమోబైల్ మార్కెట్లో ప్రస్తుతం ‘ఫ్లెక్స్ ఫ్యూయల్’ (Flex-Fuel) కార్లపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు, ఖరీదైన ముడి చమురు దిగుమతులను తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ ఇంధన వాడకాన్ని తీవ్రంగా ప్రోత్సహిస్తోంది. త్వరలోనే దేశంలో 100 శాతం ఇథనాల్ ఇంధనం అందుబాటులోకి రానున్న నేపథ్యంలో, ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ (Maruti Suzuki) ఒక అడుగు ముందుకు వేసింది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ నుండి 85శాతం ఇథనాల్ మిశ్రమం వరకు ఎలాంటి ఇంధనంతోనైనా నడిచేలా రూపొందించిన సరికొత్త ‘వ్యాగన్ ఆర్ బయోఫ్లెక్స్’ కారును మార్కెట్లో విడుదల చేసింది. అయితే ఈ కారు ధరపై ఇన్నాళ్లు చాలా మంది ఎదురుచూశారు. ఈ కారు ధర ఎంతంటే?

మారుతీ సుజుకీ ఈ సరికొత్త వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్ ప్రారంభ ధరను రూ. 7.24 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ప్రకటించింది. ఈ కారును సాధారణ వ్యాగన్ ఆర్ లోని టాప్ ఎండ్ మోడల్ అయిన ‘జెడ్ ఎక్స్ ఐ ప్లస్’ వేరియంట్ ఆధారంగా రూపొందించారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెగ్యులర్ పెట్రోల్ టాప్ మోడల్‌తో పోలిస్తే ఈ బయోఫ్లెక్స్ వేరియంట్ ధర దాదాపు రూ. 86,000 వరకు అధికం కావడం గమనార్హం.

ఈ సరికొత్త బయోఫ్లెక్స్ వెర్షన్‌ను మారుతీ సుజుకీ సంస్థ తొలుత కేవలం కమర్షియల్ వినియోగానికి మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా క్యాబ్ డ్రైవర్లు రోజుకు ఎక్కువ కిలోమీటర్లు తిరుగుతారు కాబట్టి, ఇథనాల్ ఇంధనం ద్వారా వారికి నిర్వహణ ఖర్చులు బాగా తగ్గుతాయి. అయితే, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఇథనాల్ బ్లెండింగ్ బంకులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఈ కారును సాధారణ ప్రజలందరికీ విక్రయించనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.

ప్రస్తుతం కమర్షియల్ మార్కెట్లో క్యాబ్ ఆపరేటర్ల కోసం మారుతీ సుజుకీ ప్రత్యేకంగా ‘వ్యాగన్ ఆర్ టూర్ H3’ మోడల్‌ను అందిస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.99 లక్షల నుంచి రూ. 5.89 లక్షల వరకు ఉంది. ఈ టూర్ H3 మోడల్‌తో పోల్చి చూస్తే ఇప్పుడు వచ్చిన సరికొత్త వ్యాగన్ ఆర్ బయోఫ్లెక్స్ ధర రూ. 1.35 లక్షల నుండి రూ. 2.25 లక్షల వరకు ఎక్కువగా ఉంటుంది. కానీ, టూర్ H3 లో ఉండే చిన్న 1.0 లీటర్ ఇంజిన్‌తో పోలిస్తే, బయోఫ్లెక్స్ కారులో మరింత పవర్‌ఫుల్ ఇంజిన్‌ను అందించారు.

వ్యాగన్ ఆర్ బయోఫ్లెక్స్ కారులో 1.2 లీటర్, కె 4 సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ను ఉపయోగించారు. పెట్రోల్‌లో ఎంత ఎక్కువ శాతం ఇథనాల్ కలిపినా ఇంజిన్ పాడవకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా సాగేలా దీని లోపలి భాగాలను ప్రత్యేకంగా మాడిఫై చేశారు.అయితే ఇంధనం మారినప్పటికీ కారు పవర్, టార్క్ అవుట్‌పుట్‌లో ఎలాంటి మార్పు లేకుండా సాధారణ పెట్రోల్ కారు లాగే 90.9 హెచ్‌పీ పవర్‌ను, 113.7 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇంధనంలో ఇథనాల్ శాతం పెరిగే కొద్దీ మైలేజ్ స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నందున, ఈ బయోఫ్లెక్స్ వెర్షన్ యొక్క ఖచ్చితమైన మైలేజ్ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. డిజైన్ పరంగా చూస్తే మాత్రం ఇది చూడటానికి మనకు రోడ్లపై కనిపించే సాధారణ వ్యాగన్ ఆర్ లాగే ఉంటుంది. కేవలం కారు వెనుక భాగంలో బయోఫ్లెక్స్ అనే బ్యాడ్జ్, అలాగే డోర్లపై ఫ్లెక్స్ ఫ్యూయెల్ అనే గ్రాఫిక్స్ డీకాల్స్ మాత్రమే దీని ప్రత్యేకతను తెలియజేస్తాయి. లోపల 7 అంగుళాల టచ్‌స్క్రీన్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

AP Heavy Rains: ఏపీకి భారీ వాయుగుండం.. అయినా సరే!

AP Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది తీవ్ర వాయుగుండం గా మారింది. ప్రస్తుతం ఉత్తరం వైపు ప్రయాణిస్తూ ఒడిస్సాలోని బాలాసోర్, పశ్చిమ బెంగాల్లోని హల్దియా మధ్య కేంద్రీకృతమై ఉంది. ఈరోజు...

TDP MLC Candidates: ఆశావహులు 20 మంది.. టిడిపిలో ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవి!

TDP MLC Candidates: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. గత వైసిపి ప్రభుత్వంలో గవర్నర్ కోటా కింద ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. మండలి డిప్యూటీ చైర్...

ADR Report 2026: ఏడీఆర్ నివేదిక: ఆ విషయంలో రేవంత్ ను ఎవరూ బీట్ చేయలేరు..

ADR Report 2026: దేశంలో రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు.. వారు సంపాదించిన ఆస్తులు.. ఇతర వ్యవహారాల మీద ఎప్పటికప్పుడు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రి ఫార్మ్స్ అనే సంస్థ...

West Indies vs Pakistan: పాపం పాకిస్తాన్.. వెస్టిండీస్ బౌలర్ గ్రీవ్స్ దెబ్బకు తోక ముడిచింది..

West Indies vs Pakistan: ఆ బంతులు బుల్లెట్లు.. చూస్తుండగానే వికెట్లను పడగొట్టాయి. చూస్తుండగానే వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాయి.. చూస్తుండగానే బ్యాటర్లకు నరకం చూపించాయి. ఇదంతా కూడా ఒక్కడు చేసిన అద్భుతం....

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...
Oktelugu Epaper
Exit mobile version