https://oktelugu.com/

Maruti Wagon R 2023: మారుతి వ్యాగన్ఆర్2023 రెడీ.. అదిరిపోయిన ఫీచర్లు.. వెంటనే బుక్ చేసుకోండి

Maruti Wagon R 2023: కార్లలో మారుతి రారాజు అంటారు. ఈ కంపెనీ నుంచి అనేక మోడళ్లు వాహన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా 2023 మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కు సంబంధించిన వివరాలు ఆన్ లైన్లో రిలీజ్ చేశారు. మారుతి కంపెనీ మోడళ్లు కావాలనుకునేవారు లేటేస్ట్ వ్యాగనార్ ఫీచర్స్ చూసి షాక్ అవుతున్నారు. గతంలో వాటి కంటే ఇవి ఆకట్టుకునే ఫీచర్స్ ఉండగా అప్డేట్ వెర్షన్ తో ఉన్నాయి. రాబోయే Bs6 సంబంధించిన ఫేజ్ 2, RDE […]

Written By: , Updated On : March 29, 2023 / 12:58 PM IST
Follow us on

Maruti Wagon R 2023

Maruti Wagon R 2023

Maruti Wagon R 2023: కార్లలో మారుతి రారాజు అంటారు. ఈ కంపెనీ నుంచి అనేక మోడళ్లు వాహన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా 2023 మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కు సంబంధించిన వివరాలు ఆన్ లైన్లో రిలీజ్ చేశారు. మారుతి కంపెనీ మోడళ్లు కావాలనుకునేవారు లేటేస్ట్ వ్యాగనార్ ఫీచర్స్ చూసి షాక్ అవుతున్నారు. గతంలో వాటి కంటే ఇవి ఆకట్టుకునే ఫీచర్స్ ఉండగా అప్డేట్ వెర్షన్ తో ఉన్నాయి. రాబోయే Bs6 సంబంధించిన ఫేజ్ 2, RDE నిబంధనలకు అనుగుణంగా దీని ఫీచర్స్ ఉండడం విశేషం. ఇక 2023 వ్యాగన్ ఆర్ గురించి వివరాల గురించి తెలుసుకుందాం.

2023 మారుతి వ్యాగన్ఆర్ LXi, VXi, ZXi, ZXi+ వేరియేంట్లను కలిగి ఉంది. 1.0 లీటర్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ దీని సామర్థ్యం. ఇది BS6 ఫేజ్ IIఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఇంజన్లు ఐదు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ లేదా AMT గేర్ బాక్స్ తో మిక్సయి ఉన్నాయి. డ్యూయల్ఉ జెట్ , డ్యూయల్ VVT, ISS కూల్డ్ EGRటెక్నాలజీతో కూడుకొని ఉంది. అయితే CNG వెర్షన్ 52 bhp, 82Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇకLXi, VXi, వేరియంట్లకు 1.0 లీటర్ పవర్ ట్రెయిన్ తో పరిమితం అయింది. వేరియంట్ లైనప్ లో ఐడిల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ ప్రామాణికంగా ఉంటుంది.

మారుతి సుజుకీ నుంచి 1999లో మొదటిసారి వ్యాగన్ ఆర్ రిలీజ్ అయింది. ప్రస్తుతం ఇది 11 వేరియంట్లో లభ్యమవుతోంది. బేస్ వేరియంట్ ధర రూ.5.53 లక్షలు, టాప్ -ఎండ్ వేరియంట్ ధర రూ.7.41 లక్షలు ఉంది. ధర ఎంత ఉన్నా 2023 ఫిబ్రవరిలో ఈ వేరియంట్ల అమ్మకాలు క్షీణించాయనే చెప్పొచ్చు. ఈ నెలలో కేవలం 16,889 లో యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. నెలలో 17.48 శాతం క్షీణించింది.

Maruti Wagon R 2023

Maruti Wagon R 2023

తాజాగార మార్కెట్లోకి రిలీజ్ కాబోతున్న విటారా SUV వివరాలను అన్లైన్లో పెట్టింది. దీని ఫీచర్లు నచ్చిన వారు కారును కొనుగోలు చేసేందుకు బుక్ చేసుకుంటున్నారు. ఇది పెట్రోల్ CNG అలాగే పెట్రోల్ -ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వేరియంట్లలో లభ్యమవుతోంది. 2023 ఫిబ్రవరిలో గ్రాండ్ విటారా 9183 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఇప్పుడు విటారా SUV ఏ మేరకు ఆదరణ కొనసాగుతుందో చూడాలి.