Maruti Suzuki: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా పెరిగిపోతుంది. కారు కొనాలని అనుకునేవారు విద్యుత్ వేరియంట్ పై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇందులోను మంచి బ్రాండ్ కంపెనీ కారు కొనాలని అనుకుంటున్నారు. దేశంలో అత్యధిక కార్లు సేల్స్ చేయడంలో Maruthi Suzuki ముందు ఉంటుంది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే హ్యాచ్ బ్యాక్, suv వాహనాలు ఎన్నో మార్కెట్లోకి వచ్చాయి. అయితే మిగతా కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను రోడ్లపై తిప్పుతున్నాయి. ఈ నేపథ్యంలో మారుతి కారు ఎక్కువగా కొనుగోలు చేసేవారు విద్యుత్ వాహనం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అలాంటి వారి కోసం కంపెనీ తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. మరికొన్ని రోజుల్లోనే ఈ కారును షో రూమ్ లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
మారుతి కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ వాహనం రాబోతున్నట్లు ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆటో మోబిలిటీ షోలో తెలిపింది. ఈ కంపెనీకి చెందిన Grand vitaaraa ఎస్ యు వి గా ఆదరణ పొందింది. అయితే ఇదే కారు ఇప్పుడు ఎలక్ట్రిక్ వేరియంట్ లో రాబోతుంది. మిగతా కార్లకు దీటుగా ఉండేలా దీన్ని తయారు చేశామని ఆటోమొబైలిటీ షోలో కంపెనీ ప్రతినిధులు చెప్పారు. అయితే ఢిల్లీలో ప్రదర్శించిన ఈ కారు ఎప్పుడూ మార్కెట్లోకి వస్తుందని చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో వచ్చే నెల లేదా ఆ తర్వాత నెలలో లాంచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు సిగ్నల్స్ ఇచ్చారు. మరి ఈ కారు ఎలా ఉండబోతుందంటే?
మారుతి సుజుకి గ్రాండ్ విటారా EV కారులో అన్నీ లేటెస్ట్ ఫీచర్స్ అమర్చారు. ఇందులో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ ఆకర్షిస్తాయి. అలాగే రన్నింగ్ లైట్లు డిఫరెంట్ డిజైన్ తో కలిగి ఉంటాయి. ఇందులో ట్రెడిషనల్ రేడియేటర్ గ్రిల్ లేకపోవడంతో దీని look డిఫరెంట్ గా కనిపిస్తుంది. మరోవైపు కార్ సైడ్ బ్లాక్ క్లాడింగ్ తో ఉంటుంది. ఈ కారుకు 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ ను అమర్చారు. ఈ కారు లోపల 2 స్పోర్ట్స్ స్టీరింగ్ డ్యూయల్ స్క్రీన్ సెటప్ డాష్ బోర్డును అమర్చారు. ఇందులో 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కలిగి ఉంది.
సేఫ్టీ కోసం ఇందులో ఏసీ ఈవెంట్స్ ఆటో డెమింగ్ సెమీ లేదా సీట్ ప్యాడింగ్ ను చేర్చారు. అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ సీట్స్ ,7 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే 360 డిగ్రీ కెమెరా అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టంతో ప్రయాణికులకు మంచి భద్రతను ఇస్తుంది.
ఈ కారులో 49 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ను అమర్చారు. ఈ బ్యాటరీ 142 బిహెచ్పి పవర్, 192.2nm పార్క్ లో రిలీజ్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులోనే 61 కిలోవాట్ బ్యాటరీ కూడా అమర్చారు. ఇలా రెండు బ్యాటరీలతో కార్ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటుందని కంపెనీకి చెందినవారు చెబుతున్నారు.