https://oktelugu.com/

Maruti Suzuki : కొత్త బాలెనో ఫీచర్స్ చూశారా? ఇందులో ప్రత్యేకత ఏంటంటే?

ప్రస్తుతం ఉన్న బాలెనో కనెక్ట్ టెలిమాటిక్స్ సొల్యూషన్ ను అందిస్తుంది. కానీ కొత్త సిస్టమ్ మాత్రం వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్ లో ప్యాక్ అయ్యే అవకాశం ఉంది. కొత్త బాలెనో డిజైన్ కూడా ఆకర్షిస్తోంది. దీనిని డీఆర్ఎల్ తో రీ డీజైన్ చేయబడిన హెడ్ ల్యాంపులు ఉన్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : March 9, 2024 / 01:45 PM IST

    Maruti Suzuki Baleno

    Follow us on

    Maruti Suzuki : మారుతి కార్లు అనగానే చాలా మంది ఇష్టపడుతారు. ఎందుకంటే కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకొని వీటిని తయారు చేస్తారు. మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు అన్ని వర్గాలకు అనుగుణంగా ఫీచర్స్, స్పెషిఫికేషన్ అమరుస్తారు. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన కొన్ని హ్యాచ్ బ్యాక్ కార్లు అద్భుతమైన ఫీచర్స్ తో తక్కువ ధరకే అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడున్న వాటిని అప్డేట్ చేస్తూ నేటి వారికి అనుగుణంగా మారుస్తున్నారు. మారుతి కంపెనీకి చెందిన హ్యాచ్ బ్యాక్ కార్లలో బాలెనో ది బెస్ట్ గా నిలిచింది. ఇప్పటి వరకు దీని అమ్మకాలు ఊపందుకున్నాయి. కానీ ఇప్పుడీ కారు కొత్త మోడల్ లో వస్తోంది. కొత్త కారులో ఫీచర్స్ అదిరిపోయేలా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలని ఉందా?

    మారుతి సుజుకీ గతంలో చెప్పిన విధంగా హ్యాచ్ బ్యాక్ కార్లను కొత్తగా మారుస్తూ మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఇందులో బాలెనో కూడా ఉంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్, 83 బీహెచ్ పీ స్టాండర్డ్ యూనిట్, 90 బీహెచ్ పీ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్లు ఉండనున్నాయి. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో పాటు CVT ఎంపిక కూడా ఉండనుంది. స్పెషిఫికేషన్ విషయానికొస్తే.. దీనికి కొత్తగా ఎల్ ఈడీ లైట్లను అమర్చారు. కీ లెస్ గో, ఆటో క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ ఆకర్షిస్తాయి.

    ప్రస్తుతం ఉన్న బాలెనో కనెక్ట్ టెలిమాటిక్స్ సొల్యూషన్ ను అందిస్తుంది. కానీ కొత్త సిస్టమ్ మాత్రం వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్ లో ప్యాక్ అయ్యే అవకాశం ఉంది. కొత్త బాలెనో డిజైన్ కూడా ఆకర్షిస్తోంది. దీనిని డీఆర్ఎల్ తో రీ డీజైన్ చేయబడిన హెడ్ ల్యాంపులు ఉన్నాయి. దీని బానెట్ కూడా కొత్తదిగా కనిపిస్తుంది. కొత్త బాలెనో ధర విషయానికొస్తే రూ.6.40 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు విక్రయిస్తున్నారు. అయితే దీనిని బుక్ చేసుకోవాలంటే మాత్రం 19 వారాలు ఆగాల్సిందేనని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

    ఈ కారులో ట్రాన్స్ మిషన్ ఆటోమేటిక్ గా ఉంటుంది. 5గురు ప్రయాణికులు సౌకర్యవంతంగా వెళ్లొచ్చు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఫోన్ లేదా ల్యాప్ టాప్ తొందరగా ఛార్జింగ్ అయ్యే ఫెసిలిటీస్ ఉన్నాయి. 7 రకాల రంగులతో అందుబాటులో ఉన్న ఈ మోడల్ రియర్ యూఎస్ బీ పోర్ట్ కూడా అందిస్తోంది. ఇక సేప్టీ కోసం 360 డిగ్రీ కెమెరా, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. మొత్తంగా పాత బాలెనో కంటే కొత్త దానిలో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయని చాలా మంది అంటున్నారు.