Maruti Suzuki Cars Sales: ఉమ్మడి కుటుంబం ఉన్నవారు కారు కొనాలని అనుకుంటే ఎక్కువగా 7 లేదా 8 కార్ల వైపు చూస్తుంటారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు మాత్రమే SUV వేరియంట్ లో ఇలాంటి కార్లను మార్కెట్లోకి తీసుకువస్తుంటాయి. అయితే ఇటీవల కేవలం సెడాన్ కార్లను మాత్రమే తీసుకు వస్తుందన్న పేరున్న Maruti Suzuki కంపెనీ ఇప్పుడు 7 సీటర్ కార్లలోనూ దూసుకుపోతుంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఈ కార్లు అమ్మకాల్లో మిగతా వాటికి గట్టి పోటీని ఇస్తున్నాయి. అయితే ఈ కంపెనీకి చెందిన Ertiga 2025 సంవత్సరంలో అమ్మకాల్లో దూసుకుపోయింది. ప్రత్యేకంగా SUV కార్లను తయారు చేసే వాటికి మారుతి సుజుకి కంపెనీ పోటీ ఇవ్వడం పై తీవ్ర చర్చ సాగుతోంది. అసలు ఈ కంపెనీకి చెందిన ఎర్టిగా 2025 సంవత్సరంలో ఎన్ని అమ్మకాలు ఇప్పుడు చూద్దాం..
Maruti Suzuki కంపెనీలో Ertiga 7 సీటర్ కారు ఒక నమ్మకమైన బ్రాండ్ గా భావిస్తారు. ఎందుకంటే ఉమ్మడి కుటుంబం తో పాటు ట్రావెల్ కోసం ఈ కారును ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. కొంతమందికి ప్రత్యేకంగా ఈ కారు ఉపాధిని ఇవ్వడం విశేషం. అంతేకాకుండా చిన్న కుటుంబాలు సైతం దీనిని కొనుగోలు చేస్తున్నారు. అందుకు కారణం ధర తక్కువగా ఉండడమే. అయితే ఇందులో సౌకర్యవంతమైన ఫీచర్స్ తో పాటు ఇంజన్ పనితీరు మెరుగ్గా ఉండడంతో దీనిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మారుతి ఎర్టిగా కారులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పాటు CNG ఆప్షన్ కూడా ఉంది. పెట్రోల్ ఇంజన్ 101.64 బీహెచ్పీ పవర్ తో పాటు 122 NM టార్కు ను రిలీజ్ చేస్తుంది. పెట్రోల్ ఇంజన్ పై ఈ కారు 20. 51 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. సిఎన్జి ఆప్షన్ లో 26.11 కిలోమీటర్ల మైలేజ్ వెళ్లొచ్చు.
మారుతి ఎర్టిగా 7 సీటర్ కారు అయినప్పటికీ దీని ద్వారా మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా నిర్ణయించారు. ప్రస్తుతం మార్కెట్లో దీనిని రూ.8.80 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంటు రూ.12 లక్షల వరకు ఉంది. దీంతో ఈ కారు మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా 2025 సంవత్సరంలో మొత్తం 1,92,025 యూనిట్ల విక్రయాలు జరిగాయి. 2024 సంవత్సరంలో 1,90,091 కార్లు అమ్ముడుపోయాయి. అంటే ఏడాదిలో 1,934 కార్లు అదనంగా విక్రయాలు జరుపుకోవడం విశేషం. దీనిని బట్టి చూస్తే ఎర్టిగా కారుకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కారులో కంఫర్ట్ సీట్లతోపాటు విశాలమైన క్యాబిన్ ఉండడంతో చాలామంది దీని కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.