Maruti Suzuki AMT Cars: దేశీయ కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంటోంది మారుతి సుజుకీ. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఎన్నో మోడళ్లు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయినా అప్డేట్ ఫీచర్స్ తో పాటు కొత్త వెర్షన్లను అందుబాటులోకి తెస్తూ కస్టమర్లను ఇంప్రెస్ చేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా మారుతి సుజుకీ నుంచి రిలీజ్ అయిన కార్లలో ఏదో ఒకటి నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమిస్తూ ఉంటున్నాయి. తాజాగా ఈ కంపెనీకి చెందిన ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్ కార్లు అత్యధికంగా విక్రయాలు జరుపుకున్నాయి. వీటిలో ఆటో గేర్ షిప్ట్, 4 స్పీడ్ ఆటో మేటిక్ స్టరింగ్ మౌంటెడ్ ప్యాడిల్ షిప్టర్ వంటివి ఉన్నాయి.
మారుతి సుజుకీ కంపెనీకి చెందిన కొన్ని కార్లలో ఆటో గేర్ సిస్టమ్ 5 స్పీడ్ కలిగిన కార్లు ఆకట్టుకుంటున్నాయి. వాటిలో ఆల్టో కే 10, ఎస్ ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ ఆర్, ఇగ్నీస్, స్విప్ట్, డిజైర్, బాలెనో, ఫ్రాంట్నెక్ట్స్ ఉన్నాయి. ఇదే కంపెనీకి చెందిన బ్రెజ్జా, ఎర్టీగా, గ్రాండ్ విటారాలో ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ఈ సీవీటి టెక్నాలజీ అందుబాటులో ఉంది. వాస్తవానికి మారుతి సుజుకీ కంపెనీ 2014లోనే ఆటో గేర్ షిప్ట్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి 65 శాతం కార్లలో ఆటోమేటిక్ వాహనాలు ఏజీఎస్ టెక్నాలజీనిక కలిగి ఉన్నాయి. మొత్తం కార్లలో 27 శాతం ఏటీ మోడల్స్ కలిగి ఉండగా 8 శాతం ఈ సీవీటి ని అమర్చారు.
ఈ క్రమంలో ఆటో మేటిక్ కార్ల విక్రయాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇందులో మారుతి సుజుకీ కంపెనీకి చెందినవి ఆకర్షిస్తున్నాయి. ఈ సందర్భంగా మారుతి కంపెనీకి చెందిన సేల్స్ ఎగ్గిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ మాట్లాడుతూ మారుతి సుజుకీ ఆటోమేటిక్ కార్ల కంపెనీ క్రమంగా విక్రయాలు పెంచుకుంటుందని తెలిపారు.బ 2023తో పాటు వచ్చే ఏడాదిలో లక్ష విక్రయాలు అమ్మకాల మార్క్ ను చేయబోతున్నట్లు తెలిపారు. వినియోగదారుల ఇష్టఇష్టాలను అర్థం చేసుకొని హై ఎండ్ ఆటోమేటిక్ వేరియంట్లను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా ఆటోమేటిక్ కార్ల విక్రయాలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఫస్ట్ డిల్లీ ఉండగా ఆ తరువాత మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఆటోమేటిక్ కార్ల విక్రయాల్లో నెక్సా 58 శాతం వాటాను కలిగి ఉంది. ఎరేనా 42 శాతం కలిగి ఉన్నాయి. త్వరలో మారుతి సుజుకీ కంపెనీ 10 లక్షలక యూనిట్ల అమ్మకాల మార్కును అధిగమించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.