https://oktelugu.com/

Maruti S Presso : కాంపాక్ట్ SUV.. కానీ మైలేజ్ అదిరిపోద్ది.. బైక్ తో పోటీ పడుతున్న ఈ కారు గురించి తెలుసా?

కొత్త కారు కొనాలనుకువారు ఈ మధ్య ఎక్కువగా కాంపాక్ట్ ఎస్ యూవీల వైపు చూస్తున్నారు. ఎస్ యూవీ కార్లపై ఆసక్తి ఉన్న వారు లోబడ్జెట్ లో రావాలంటే ఇవి బెస్ట్ ఆప్షన్. అందుకే కొన్ని కంపెనీలు ఈ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడానికి ఆసక్తి చూపుతున్నాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 1, 2024 / 11:28 AM IST

    Maruti S Presso

    Follow us on

    Maruti S Presso K : ప్రయాణాలు చేయడానికి ఎక్కువ మంది బైక్ ను కొనుగోలు చేస్తారు. దీని ద్వారా ఎక్కడికైనా వెళ్లొచ్చు. గల్లీ రోడ్లతో పాటు ఇరుకుగా ఉండే ప్రదేశాల్లోకి వెళ్లొచ్చు. బైక్ కంటే కారులో ఎక్కువ మంది ప్రయాణం చేయొచ్చు. కానీ కొన్ని ప్రదేశాలకు వెళ్లడానికి బైక్ మాత్రమే సౌకర్యంగా ఉంటుంది. కానీ ఇప్పుడు బైక్ తో పోటీ పడే ఓ కారు మార్కెట్లో ఆకట్టుకుంటోంది. ఇది చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుంది. దీంతో ఇరుకు గదుల్లోకి కూడా వెళ్లొచ్చు. ఇది కాంపాక్ట్ ఎస్ యూవీ.. అయినా బైక్ కు వచ్చే మైలేజ్ ఇస్తోంది. దీంతో ఈ మోడల్ పై ఆసక్తి చూపుతున్నారు. ఇంతకీ ఇది ఏ కారు? ఇందులో ఉండే ఫీచర్లు ఏంటీ?

    కొత్త కారు కొనాలనుకువారు ఈ మధ్య ఎక్కువగా కాంపాక్ట్ ఎస్ యూవీల వైపు చూస్తున్నారు. ఎస్ యూవీ కార్లపై ఆసక్తి ఉన్న వారు లోబడ్జెట్ లో రావాలంటే ఇవి బెస్ట్ ఆప్షన్. అందుకే కొన్ని కంపెనీలు ఈ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగా మారుతి కంపెనీకి చెందిన S-Presso ఈ కోవలోకి వస్తుంది. ఈ మోడల్ తక్కువ బడ్జెట్ లోనే అందుబాటులోకి రావడంతో పాటు మంచి ఫీచర్స్ అందిస్తోంది. అంతేకాకుండా మైలేజ్ విషయంలో బెస్ట్ మోడల్ అనిపించుకుంటుంది.

    మారుతి ఎస్ ప్రెస్సో కె సీరిస్ 1.0 లీటర్ డ్యూయెల్ జెట్ ఇంజిన్ తో పాటు 68 బీహెచ్ పీ పవర్ ను అందిస్తుంది. 91 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఇందులో సీఎన్ జీ ఆప్షన్ కూడా ఉంది. ఈ మోడల్ మాన్యువల్ తో పాటు ఏఎంటీ గేర్ బాక్స్ తో వర్క్ చేస్తుంది. పెట్రోల్ ఇంజిన్ లో ఎస్ ప్రెస్సో లీటర్ కు 24.12 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. సీఎన్ జీ ఆప్షన్ పై 32.73 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ మోడల్ లో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 7.0 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సిస్టమ్ ఉంది. సౌండింగ్ కోసం 6 స్పీకర్లు, డిజిటల్ ఇనుస్ట్రుమెంట్లు, ఫ్రంట్ పవర్ విండ్ అమర్చారు. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో పాటు ఫ్రంట్ డిస్క్ బ్రేక్, స్పీడ్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

    మారుతి ఎస్ ప్రెస్సో ఎక్స్ షోరూం ధర రూ.4.26 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్ రూ.6.12 లక్షల వరకు ఉంది. రెనాల్ట్ క్విడ్ తో పోటీ పడుతోంది. 5గురు సౌకర్యవంతంగా కూర్చోడానికి వీలున్న ఈ మోడల్ ను ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లచ్చు. మార్కెట్లోకి ఇప్పుడొస్తున్నకొన్ని బైక్ లు 40 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తున్నాయి. వాటికంటే ఈ కారు ఎంతో మెరుగైనదని కొందరు అంటున్నారు. అంతేకాకుండా ఎస్ యూవీ వేరియంట్ కోరుకునేవారు మైక్రో ఎస్ యూవీగా ఇది సౌకర్యవంతంగా ఉంటుంది.