Maruti Jimny : భారతదేశంలో తనదైన ముద్ర వేసిన తర్వాత మారుతి జిమ్నీ ఇప్పుడు జపాన్‌లో కూడా విడుదల అయింది. జిమ్నీ 5 డోర్ల వేరియంట్ భారతదేశంలో అమ్ముడవుతోంది. జిమ్నీ 3 డోర్ల వేరియంట్ ఇప్పటికీ జపాన్, యూరప్‌లో అమ్ముడవుతోంది. ఇప్పుడు మారుతి 5 డోర్ల మారుతి జిమ్నీని జపాన్‌లో విడుదల చేయబోతోంది. వీటన్నింటిలో అతి పెద్ద విషయం ఏమిటంటే, జపాన్‌లో విడుదల కానున్న జిమ్నీ మేడ్ ఇన్ ఇండియా మోడల్ ఇదే కావడం విశేషం.
NOMADE పేరుతో జిమ్నీ
జపాన్‌కు చెందిన ఒక ఆన్‌లైన్ పోర్టల్ ప్రకారం.. 5 డోర్ల జిమ్నీ త్వరలో జపాన్‌లో ప్రారంభించబడుతోంది. ప్రస్తుతం 5 డోర్ల జిమ్నీ భారతదేశంలో మాత్రమే అమ్ముడవుతోంది. మారుతి జిమ్నీని జపాన్‌లో జిమ్నీ నోమేడ్ పేరుతో పరిచయం చేయనుంది.
డ్యూయల్ టోన్ కలర్‌లో రానున్న జిమ్నీ
జపాన్‌లో లాంచ్ కానున్న జిమ్నీకి సంబంధించిన కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిలో ఇది సిజ్లింగ్ రేజ్, బ్లాక్ డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌తో కనిపిస్తుంది. వైరల్ ఫోటోలో, కారు నల్లటి పైకప్పు, ముందు భాగంలో NOMADE ప్లేట్‌తో కనిపిస్తుంది. మారుతి జిమ్నీ జపాన్‌లో లాంచ్ కానున్న రెండవ మేడ్ ఇన్ ఇండియా కారు అవుతుంది. అంతకుముందు, సుజుకి ఫ్రంట్క్స్ గత సంవత్సరం జపాన్‌లో ప్రారంభించబడింది.
మారుతి జిమ్నీ ఇంజిన్
జిమ్నీ 1.5-లీటర్, 4-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికతో వస్తుంది. దీని ఇంజన్ 105bhp పవర్, 134Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మారుతి సుజుకి జిమ్నీ మాన్యువల్ మోడల్ లీటరుకు 16.94 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని.. ఆటోమేటిక్ మోడల్ లీటరుకు 16.39 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని పేర్కొంది.
మారుతి జిమ్నీ ఫీచర్స్
ఈ SUVలో సుజుకి ఆల్‌గ్రిప్ ప్రో 4WD సిస్టమ్ అమర్చబడి ఉంటుంది. ఇందులో మాన్యువల్ ట్రాన్స్‌ఫర్ కేస్, లో-రేంజ్ గేర్‌బాక్స్, 3-లింక్ సస్పెన్షన్, టూ-వీల్ డ్రైవ్-హై, ఫోర్-వీల్ డ్రైవ్ హై, ఫోర్-వీల్ డ్రైవ్ లో మోడ్‌లు, ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లు ఉంటాయి.
జిమ్నీ ఆల్ఫా వేరియంట్ గురించి మాట్లాడుకుంటే.. ఇది 9.0-అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ LED హెడ్‌ల్యాంప్‌లు, కీలెస్ ఎంట్రీ వంటి ప్రత్యేక ఫీచర్స్ కలిగి ఉంది. సేఫ్టీ కోసం, SUV 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్‌లతో ప్రామాణికంగా వస్తుంది.