Maruti Alto K10 : భారతీయ మార్కెట్‌లో ఆటో కంపెనీలు కస్టమర్ల బడ్జెట్, అవసరాలకు తగ్గట్లుగా ప్రతి సెగ్మెంట్లో కార్లను తయారు చేసి అందుబాటులో ఉంచాయి. దేశంలో ఎక్కువగా అమ్ముడయ్యే బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లలో మారుతి సుజుకి ఆల్టో కూడా ఒకటి. కానీ ఈ కారు పాకిస్తాన్‌లో ఎంత ధర పలుకుతుందో తెలుసా.. ఇక్కడ 5 లక్షల రూపాయల కంటే తక్కువ ధరలో లభించే ఈ కారును పొరుగు దేశంలో కొనడానికి ప్రజలు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది.
భారతదేశంలో ఆల్టో K10 ధర ఎంత?
మారుతి సుజుకి ఈ హ్యాచ్‌బ్యాక్‌ను వినియోగదారులు బాగా ఇష్టపడతారు. అందుకే ఈ కారు మనకు రోడ్లపై ఎక్కువగా కనిపిస్తుంది. ఈ కారు బేస్ వేరియంట్ ధర రూ. 4.23లక్షల(ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. అదే వ్యక్తి ఈ కారు టాప్ వేరియంట్‌ను కొనాలనుకుంటే, తను రూ.6.20 లక్షల (ఎక్స్-షోరూమ్) ఖర్చు చేయాల్సి ఉంటుంది.
Also Read : చిన్న ఫ్యామిలీకి తక్కువ ధరకు వచ్చే కారు ఇదే.. మంచి మైలేజ్ కూడా..
పాకిస్తాన్‌లో ధర ఎంత?
సుజుకి పాకిస్తాన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఈ కారు ప్రారంభ ధర PKR 2,707,000 (సుమారు రూ. 8.20లక్షల). అదే సమయంలో ఈ కారు టాప్ మోడల్ PKR 3,140,000 (సుమారు రూ.9.51లక్షల)కు విక్రయించబడుతోంది. పాకిస్తాన్‌లో ఈ కారు ధర చాలా ఎక్కువగా ఉంది. ఈ ధరకు భారతీయులు SUV ని కొనుగోలు చేయవచ్చు.
సేఫ్టీ ఫీచర్లు
భారతదేశం, పాకిస్తాన్‌లో విక్రయించే ఆల్టో సేఫ్టీ ఫీచర్లలో చాలా డిఫరెన్స్ ఉంది. పాకిస్తానీ ఆల్టోలో సేఫ్టీ కోసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ డిస్ట్రిబ్యూషన్‌తో యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, చైల్డ్ సీట్ కోసం ISOFIX సపోర్ట్ లభిస్తాయి. మరోవైపు భారతీయ వేరియంట్‌లో 2 కాకుండా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, EBDతో ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్‌లు ఉన్నాయి.
Also Read : లీటర్ పెట్రోల్ కు 34 కిలోమీటర్లు.. ఈ కారు గురించి తెలిస్తే విడిచిపెట్టరు..