Maruthi Suzuki Jimny : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మారుతీ సుజుకీ జిమ్నీ మార్కెట్లోకి రానే వచ్చింది. ఇంతకాలం ఆన్లైన్లో ఊరిస్తూ… ఫీచర్లతో ఆకట్టుకున్న ఈ వెహికల్ మార్కెట్లోకి రాగానే 4 వీలర్ నడిపేవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 30 వేల ఆర్డర్లు బుక్ అయిన జిమ్నీని సొంతం చేసుకోవడానికి ఆరాటపడుతున్నారు. ఇప్పటికీ బుక్ చేసుకున్నవారికి జూన్ మధ్య నుంచి సరఫరా చేస్తామని డీలర్లు చెప్పిన విషయం తెలిసిందే. రెడ్ కలర్ లో ఆకట్టుకుంటున్న జిమ్నీని ఎంత ధరకు అమ్ముతున్నారు? దాని ఫీచర్లు ఏంటి? ఒకసారి తెలుసుకుందాం..
మారుతి సుజుకీ నుంచి ఇప్పటికే వివిధ మోడళ్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. నిన్నటి వరకు వ్యాగన్ ఆర్ హవా సాగింది. తక్కువ ధరలో హై ఫై ఫీచర్లు ఉండడంతో పాటు సీటింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ కావడంతో మారుతి బండ్ల కోసం ఎగబడ్డారు. ఈ తరుణంలో కంపెనీ నుంచి ఏ కొత్త వాహనం వచ్చినా దానిని సొంతం చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. వినియోగదారుల అభిరుచి, అవసరాలకు తగ్గట్లుగా జిమ్నీని తయారు చేశామని ఇప్పటికే కంపెనీ నిర్వాహకులు తెలిపారు. ఈ నేపథ్యంలో దీని గురించి తెలుసుకుందాం..
జిమ్నీ స్పెసిఫికేషన్ విషయానికొస్తే.. మాన్యువల్ వేరియంట్ లీటర్ కు 16.94 కిలో మీటర్ల మైలేజీ ఇస్తేంది. అదే ఆటోమేటిక్ వేరియంట్ కు లీటర్ కు 16.39 కిలోమీటర్లు రన్ అవుతుంది. ఇందులో 5 స్పీడ్-ఆటోమేటిక్ 4 స్పీడ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 5 డోర్లతో.. 210 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ తో 1.5 లీటర్, 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ తో ఉన్న ఈ ఎస్ యూవీ 105 హెచ్ పీ పవర్ ను 134 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అల్ఫా, జెటా, అనే రెండు వేరియంట్లలోనూ ఇది అందుబాటులో ఉంది.
మారుతి నుంచి రిలీజ్ అయ్యే వాహనాలు తక్కువ ధరకే ఉంటాయన్న భావన చాలా మంది వినియోగదారులకు ఉంది. అయితే జిమ్నీ మాత్రం హైఫై స్పెషిఫికేషన్ ను కలిగి ఉంది. అలాగే అద్భుతమైన ఫీచర్లతో కూడుకొని ఉంది. దీని ఫీచర్ల విషయానికొస్తే 9 ఇంచెస్ స్మార్ట్ ఫ్రో + ఇన్ఫోటైన్మెంట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ ఉన్నాయి. ఈ వెహికిల్ లో 6 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. మొత్తం ఏడు రంగుల్లో ఉన్న ఈ వాహనం ప్రస్తుతానికి రెడ్ కలర్లో రిలీజ్ చేశారు. ఇక జిమ్నీరూ.12.74 లక్షల నుంచి రూ.15.05 లక్షల వరకు విక్రయిస్తున్నారు.