https://oktelugu.com/

Tata Cars : టాటా కార్లపై భారీగా తగ్గింపు.. వెంటనే త్వరపడండి..

సీఎన్ జీ కార్లలో టియాగో ది బెస్ట్ గా నిలిచిన విషయం తెలిసిందే. టాటా సిఎన్ జీ కారుపై రూ.75 వేల డిస్కౌంట్ ను ప్రకటించింది. ఇందులో రూ.50 వేల క్యాష్ డిస్కౌంట్, ఎక్చేంజ్ బోనస్ కింద రూ.15 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.10 వేలు అందిస్తోంది. టాటా నెక్సాన్ కారుపై రూ.68 వేల డిస్కౌంట్ ను ప్రకటించింది.

Written By:
  • NARESH
  • , Updated On : March 13, 2024 / 08:41 PM IST
    Follow us on

    Tata Cars : కారుకొనాలనుకునే ప్రతి ఒక్కరూ డిస్కౌంట్ గురించి ఆలోచిస్తారు. కొన్ని కంపెనీలు తమ సేల్స్ పెంచుకునేందుకు సాధారణ సమయాల్లో కూడా ఆఫర్లు ప్రకటిస్తాయి. తాజాగా టాటా మోటార్స్ సూపర్ డీల్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కొన్ని కార్లపూ భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది. అయితే ఈ తగ్గింపు మార్చి నెలాఖరు వరకేనని తెలిపింది. అంతేకాకుండా ఈ కార్ల డిస్కౌంట్లు ఆయా ప్రాంతాలను బట్టి మారుతాయని కూడా తెలిపింది. ఇంతకీ ఏయే కార్లపే ఎలాంటి డిస్కౌంట్లు ఉన్నాయో చూద్దాం..

    టాటా కంపెనీకి చెందిన టియాగో గురించి కారు ఉపయోగించే ప్రతి ఒక్కరికీ తెలిసిందే. టియాగో పెట్రోల్ ఆటోమేటిక్ అనే కారుపై రూ.70 వేల డిస్కౌంట్ ను ప్రకటించింది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ.45 వేలు, ఎక్చేంజ్ బోనస్ కింద రూ.15 వేలు, కార్పొరేట్ బోనస్ కింద రూ.10 వరకు తగ్గింపును పొందవచ్చు. టియాగో ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ కారుపై రూ.60 వేల తగ్గింపును ప్రకటించింది. ఇందులో ఎక్చేంజ్ బోనస్ రూ.15 వేలు, క్యాష్ డిస్కౌంట్ రూ.35 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.10 వేలు ఇవ్వనుంది.

    సీఎన్ జీ కార్లలో టియాగో ది బెస్ట్ గా నిలిచిన విషయం తెలిసిందే. టాటా సిఎన్ జీ కారుపై రూ.75 వేల డిస్కౌంట్ ను ప్రకటించింది. ఇందులో రూ.50 వేల క్యాష్ డిస్కౌంట్, ఎక్చేంజ్ బోనస్ కింద రూ.15 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.10 వేలు అందిస్తోంది. టాటా నెక్సాన్ కారుపై రూ.68 వేల డిస్కౌంట్ ను ప్రకటించింది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ.40 వేలు, ఎక్చేంజ్ రూ.20 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ. 8 వేలు ఇస్తోంది.

    నెక్సాన్ కంపెనిక చెందిన ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ కారుపై రూ. 48 వేల డిస్కౌంట్ ను ప్రకటించింది. ఇందులో రూ.20 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.20 వేల ఎక్చేంజ్ కింద రూ.8 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.8 వేలు ఇవ్వను్నారు. న్యూ నెక్సాన్ పెట్రోల్ కారుపై రూ.38 వేల డిస్కౌంట్ ను ప్రకటించింది. ఇందులో రూ.30 వేల వరకు డిస్కౌంట్ ను ఇవ్వనున్నారు. అందువల్ల డిస్కౌంట్ కింద కారు కొనాలనుకునేవారు వెంటనే టాటా కార్ల గురించి ఆలోచించవచ్చు.