https://oktelugu.com/

Mahindra XUV400 Vs Tata Nexon: మహీంద్రా XUV400 vs టాటా నెక్సాన్.. ఏది బెస్ట్ కార్? రెండింటి మధ్య తేడాలేంటి?

టాటా నెక్సాన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఇంటీరియర్ డిజైన్. ఫిట్ అండ్ ఫినిషింగ్ డిపార్టుమెంట్ లో విశాలమైన స్పేస్ ను కలిగి ఉంది. నెక్సాన్ ఈవీ లో ఎల్ ఈడీ లైట్లతో కూడిన స్ప్లిట్ హెడల్ ల్యాంప్ సెటప్, కూల్ లుకింగ్ 16 ఇంచెస్ అల్లాయ్ లు వంటి వంటివి కలిగి ఉన్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : October 13, 2023 11:56 am
    Mahindra XUV400 Vs Tata Nexon

    Mahindra XUV400 Vs Tata Nexon

    Follow us on

    Mahindra XUV400 Vs Tata Nexon: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల హవా పెరిగిపోతుంది. పెట్రోల్, డీజిల్ కు ప్రత్యామ్నాయంగా వాతావరణ కాలుష్యం లేకుండా ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈయూ)లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వీటిలో టాటా, మహీంద్రా కంపెనీలు పోటీ పడుతున్నాయి. టాటా నుంచి రిలీజ్ అయిన నెక్సాన్ ఈవీ, మహీంద్రా XUV400 ఫీచర్లు, ధరల విషయంలో పోటీ పడుతున్నాయి. ఈ తరుణంలో ఈ రెండు కార్ల ఫీచర్లు, ధరలు ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

    టాటా నెక్సాన్:
    టాటా నెక్సాన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఇంటీరియర్ డిజైన్. ఫిట్ అండ్ ఫినిషింగ్ డిపార్టుమెంట్ లో విశాలమైన స్పేస్ ను కలిగి ఉంది. నెక్సాన్ ఈవీ లో ఎల్ ఈడీ లైట్లతో కూడిన స్ప్లిట్ హెడల్ ల్యాంప్ సెటప్, కూల్ లుకింగ్ 16 ఇంచెస్ అల్లాయ్ లు వంటి వంటివి కలిగి ఉన్నాయి. వీ ఆకారపు టెయిల్, లైట్లు వెనుక వైపర్ ను కప్పి ఉంచే రూప్ మౌంటె స్పాయిలర్ ఉన్నాయి. ఇందులో ఉండే డ్యాష్ బోర్డు లేటేస్ట్ ను కలిగి ఉంది. ఇది 4 రకాలా రంగుల్లో లభ్యమవుతుంది. 5 డోర్లు ఉన్న ఇది ఫ్రంట్ ఇంజిన్, ఫ్రంట్ వీల్ డ్రైవ్,, ఫ్రంట్ మోటార్ ఉంటాయి. 1.2 లీటర్ రివోట్రన్ 13, 1.5 లీటర్ డీజిల్ రీవోట్రన్ 14 ఉన్నాయి. 81.88 కిలోవాట్ పెట్రోల్ ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్ ను కలిగిన దీని ధర రూ.14.74 లక్షల నుంచి ప్రారంభ ధర ఉంది.40.5 కిలోవాట్ ను కలిగిన దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే 465 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

    మహీంద్రా XUV400:
    మహీంద్రా XUV400 సాంప్రదాయకంగా కనిపిస్తుంది. అయినా ఇందులో 16 అంగుళాల అల్లాయ్ తో కూడిన బ్లాంక్డ్ ఆప్ ఫ్రంట్ గ్రిల్, టెయిల్ లైట్ల కోసం ఎల్ ఈడీ ఉన్నాయి. ఇది 310 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 147.51 పవర్ ను కలిగి ఉంటుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 375 నుంచి 456 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. 5 సీటిగ్ కెపాసిటీ కలిగిన ఇందులో 4 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇది 34.5 కిలోవాట్ , 39.5 కిలోవాట్ బ్యాటరీని పొందుతుంది. 8.3 సెకన్లలో 100 కిలోమీటర్ల పరుగులు పెడుతుంది. ఇది రూ.15.99 ఎక్స్ షోరూం ధరను కలిగి ఉంది.

    టాటా నెక్సాన్ Vs మహీంద్రా XUV400:
    ఈ రెండు ఈవీలు ఎస్ యూవీ వేరియింట్లు అయినప్పటికీ వీటి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. అయితే మహీంద్రా XUV400 కంటే టాటా నెక్సాన్ ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. కానీ టాటా నెక్సాన్ వేగం అందుకోవడంలో ముందుంటుంది. టాటా నెక్సాన్ ఇంటిరీయర్ స్సేప్ XUV400 కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే రెండు కార్లపైవినియోగదారులు ఎక్కువగా మనసుపెడుతున్నారు. ధర విషయంలోనూ XUV400 కంటే టాటా నెక్సాన్ ఎక్కువగా ఉంది.