https://oktelugu.com/

Reid Hoffman: పదేళ్లలో ఆ ఉద్యోగాలు మాయం.. లింక్డిన్‌ వ్యవస్థాపకుడి అంచనా..!

ఉద్యోగం అంటే.. సంస్థ లేదా కార్యాలయం లేదా కంపెనీ లేదా ఫ్యాక్టరీకి వెల్లి 8 గంటపాటు చేసే పని. ఉదయం వెళ్లి సాయంత్రం వస్తే సరిపోతుంది. ఇది అందరిలో ఉన్న భావనం. ఇకపై ఇలాంటివి ఉండకపోవచ్చంటున్నారు లింక్డిన్‌ వ్యవస్థాపకుడు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 26, 2024 4:38 pm
    Reid Hoffman

    Reid Hoffman

    Follow us on

    Reid Hoffman: శ్రమయేవ జయతే.. కష్టపడి పనిచేసేవారికి ఎప్పుడూ గుర్తింపు, అభివృద్ధి ఉంటుంది. ఇందులో భాగంగానే శ్రామిక శక్తిని గుర్తించేందుకు అనేక ఉద్యోమాలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. హక్కులకు భంగం కలిగితే ఇప్పటికీ కార్మికులు, ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. డిమాండ్లు నెరవేర్చుకుంటున్నారు. ఇక పని గంటల విషయంలో చేసిన పోరాట ఫలితంగానే మే డే పుట్టుకొచ్చింది. 8 గంటల పని విధానం అమలులోకి వచ్చింది. అయితే మారుతున్న కాలంతో ఉద్యోగాల తీరు, పని విధానం మారుతోంది. అధిక ఆదాయం కోసం ఎక్కువ గంటలు పనిచేయడం, ఉద్యోగం ఉండాలంటే.. అప్పగించిన పని పూర్తి చేయడం. టార్గెట్‌ బేస్‌ ఉద్యోగాలు పెరిగాయి. దీంతో 8 గంటల పని విధానం ఎప్పుడో మాయమైంది. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ చాలా మంది ఎక్కువ గంటలే పనిచేస్తున్నారు. కొన్ని శాఖల్లో మాత్రమే 8 గంటల పని విధానం కొనసాగుతోంది. విద్యాసంస్థలు, ఆస్పత్రుల్లో ఉదయం వెళ్లి సాయంత్రం రావడం లాంటి ఉద్యోగాలు ఉన్నాయి. ఇక కొవిడ్‌ సంక్షోభం తర్వాత కంపెనీల నిర్వహణలో అనూహ్య పరిణామాలు జరిగాయి. ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం దగ్గర నుంచి కీలక సమావేశాలన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగిపోవడం వరకు పలు మార్పులు చూశాం. కంపెనీల అవసరాలు.. స్థానికంగా ఉంటూ విదేశాల్లోని కంపెనీలతో కలిసి పనిచేయాల్సి రావడం.. వర్క్‌ స్పీడ్‌ పెంచడం వంటి కారణాలతో రాబోయే రోజుల్లో ఉద్యోగాల్లో మరిన్ని మార్పులు తథ్యం. ఇక లిజెన్స్‌ అందుబాటులోకి రావటంతో భవిష్యత్తులో ఇంకా ఎలాంటి కొత్త ధోరణులు రానున్నాయోననే ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో ప్రముఖ సామాజిక మాధ్యమం లింక్టిన్‌ సహ వ్యవస్థాపకుడు రీడ్‌ హాఫ్మన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఏతరహా ఉద్యోగాలు ఉంటాయో చెప్పి సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకే తెరతీశారు.

    సామాజిక మాధ్యమాల ఆవష్యకతను గుర్తించి..
    టెక్‌ రంగంలో విస్తృత అనుభవం ఉన్న హాఫ్మన్‌ గతంలో చేసిన పలు అంచనాలు నిజమయ్యాయ. సామాజిక మాధ్యమాలకు విపరీతమైన ఆదరణ రానుందని ఆయన ముందే పసిగట్టారు. అలాగే గిగ్‌ ఎకానమీ ఊపందుకుంటుందని చాలాకాలం క్రితమే అంచనా వేశారు. కృత్రిమ మేధ విప్లవం రానుందని 1997లోనే చెప్పారు. తాజాగా.. ప్రస్తుతం ఉన్న 9–5 ఉద్యోగాలు అంటే ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగవుతాయని అంచనా వేశారు. రాబోయే రోజుల్లో ఉద్యోగులు ఒకే దగ్గర, ఒకే విధిని నిర్వర్తించబోరని తెలిపారు. ఒకే సమయంలో వివిధ కంపెనీలకు రకరకాల పనులు చేసే రోజులు రానున్నాయని చెప్పారు.

    పదేళ్లలో పెను మార్పులు..
    రాబోయే పదేళ్లు.. అంటే 2034 నాటికి ఇప్పుడున్న సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగవుతాయని హాఫ్మన్‌ తెలిపారు. దీనివల్ల అవకాశాలతోపాటు, సవాళ్లూ ఉంటాయని వివరించారు. స్థిరమైన ఉద్యోగాలు లేకపోవడం, నిపుణులు దీర్ఘకాలంలో ఒకేచోట పనిచేయడానికి ఇష్టపడకపోవడం వల్ల సమస్యలు తప్పవని తెలిపారు. అదే సమయంలో ఒకే వ్యక్తి వివిధ కంపెనీలకే కాకుండా తన నైపుణ్యాలు, ప్రతిభకు అనుగుణంగా పలు రంగాల్లో రకరకాల విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుందని వెల్లడించారు. దీనివల్ల కంపెనీల ఉత్పాదకత పెరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఆతిథ్యరంగం సహా అన్ని సెక్టార్లకు కృత్రిమ మేధ అనుసంధానమవుతుందని హాఫ్మన్‌ అంచనా వేశారు.

    ఇప్పటికే మూన్‌లైట్‌..
    ఇదిలా ఉంటే.. హాఫ్మన్‌ రాబోయే పదేళ్లలో ఒకే సమయంలో వివిధ కంపెనీలకు ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుందని వెల్లడించారు. కానీ, ఇప్పటికే ఆ పరిస్థితి ప్రారంభమైంది. కరోనా సమయంలో వర్క్‌ఫ్రం హోం వచ్చాక చాలా మంది టెకీలు ఇంట్లో ఉంటూ తాపు పనిచేస్తున్న సంస్థతోపాటు ఇతర ప్రాజెక్టులు చేశారు. దీంతో మూన్‌లైట్‌ జాబ్స్‌ పెరిగాయి. ఇప్పటికీ ప్రైవేటురంగంలో ఈ విధానం కొనసాగుతుంది. హాఫ్మన్‌ అంచనా ప్రకారం.. రాబేయే పదేళ్లలో మూన్‌లైన్‌ ఇక రెగ్యులర్‌ అవడం ఖాయం.