Lic:  ఎల్ఐసీ సూపర్ పాలసీ.. రోజుకు రూ.28 ఆదాతో లక్షల్లో సంపాదించే ఛాన్స్?

Lic:  దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో మైక్రో సేవింగ్స్ ప్లాన్స్ ను అమలు చేస్తోంది. తక్కువ ఆదాయం ఉన్నవాళ్లకు ప్రయోజనం చేకూరేలా ఎల్ఐసీ ఈ పాలసీలను అందిస్తోంది. ఈ పాలసీ ద్వారా తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభాలను పొందే అవకాశం ఉంటుంది. రోజుకు కేవలం 28 రూపాయలు ఆదా చేయడం సులభంగా మంచి లాభాలను అందుకునే అవకాశం ఉంటుంది. ఎల్ఐసీ మైక్రో సేవింగ్స్ ప్లాన్ లో మొత్తం 5 పెద్ద […]

Written By: Kusuma Aggunna, Updated On : January 5, 2022 9:09 am
Follow us on

Lic:  దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో మైక్రో సేవింగ్స్ ప్లాన్స్ ను అమలు చేస్తోంది. తక్కువ ఆదాయం ఉన్నవాళ్లకు ప్రయోజనం చేకూరేలా ఎల్ఐసీ ఈ పాలసీలను అందిస్తోంది. ఈ పాలసీ ద్వారా తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభాలను పొందే అవకాశం ఉంటుంది. రోజుకు కేవలం 28 రూపాయలు ఆదా చేయడం సులభంగా మంచి లాభాలను అందుకునే అవకాశం ఉంటుంది.

ఎల్ఐసీ మైక్రో సేవింగ్స్ ప్లాన్ లో మొత్తం 5 పెద్ద ఫీచర్లు ఉండగా ఈ పాలసీని తీసుకున్నవాళ్లు జీఎస్టీని చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పాలసీలో మూడు సంవత్సరాలు ప్రీమియం చెల్లించి తర్వాత ప్రీమియం చెల్లించకపోయినా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదని చెప్పవచ్చు. ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేకుండానే సులభంగా ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీకి లాయల్టీ అదనంగా ఉంటుంది.

ఈ పాలసీ ద్వారా 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ బెనిఫిట్ తో పాటు జీవిత బీమా కవరేజీని కూడా సులువుగా పొందడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. 35 సంవత్సరాల వ్యక్తి సంవత్సరానికి 9831 రూపాయల చొప్పున పాలసీని తీసుకుంటే ఆ వ్యక్తి మెచ్యూరిటీ మొత్తంపై 2,30,000 రూపాయలు పొందే ఛాన్స్ ఉంటుంది. పాలసీ తీసుకున్న వ్యక్తి 5 సంవత్సరాల లోపు మరణిస్తే నామినీకి 2 లక్షల రూపాయలు లభిస్తాయి.

పాలసీ తీసుకున్న 5 సంవత్సరాల తర్వాత పాలసీదారు మరణిస్తే నామినీకి 2 లక్షల రూపాయల వరకు డబ్బుతో పాటు లాయల్టీ బెనిఫిట్ లభిస్తుంది. ప్రీమియం చెల్లించిన సంవత్సరాల సంఖ్యను బట్టి లాయల్టీ జోడింపును సులభంగా పొందవచ్చు.