https://oktelugu.com/

LIC Scholarship: విద్యార్థులకు ఎల్ఐసీ శుభవార్త.. ఏడాదికి రూ.20,000 పొందే అవకాశం?

LIC Scholarship: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిభావంతులైన విద్యార్థులకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ పేరుతో కనీసం 60 శాతం మార్కులతో పది, ఇంటర్ పాసైన విద్యార్థులకు స్కాలర్ షిప్ లను ప్రకటించింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ స్కాలర్ షిప్ లకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 12, 2021 / 08:41 AM IST
    Follow us on

    LIC Scholarship: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిభావంతులైన విద్యార్థులకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ పేరుతో కనీసం 60 శాతం మార్కులతో పది, ఇంటర్ పాసైన విద్యార్థులకు స్కాలర్ షిప్ లను ప్రకటించింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ స్కాలర్ షిప్ లకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

    ఎల్ఐసీ ఆడపిల్లల కొరకు ప్రత్యేక స్కాలర్ షిప్ లు అందజేయడంతో పాటు డివిజినల్ కేంద్రానికి రెగ్యులర్ స్కాలర్ షిప్ లను అందించనుంది. ఎల్ఐసీ డివిజనల్ కేంద్రానికి మొత్తం 20 స్కాలర్ షిప్ లు ఉండగా 10 మంది బాలురు, 10 మంది బాలికలు ఈ స్కాలర్ షిప్ కు అర్హతను పొందవచ్చు. ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు అర్హులు కాగా అర్హులైన విద్యార్థులకు సంవత్సరానికి 20,000 రూపాయల స్కాలర్ షిప్ లభిస్తుంది.

    ఎల్ఐసీ ఆడపిల్లల కోసం ప్రత్యేక స్కాలర్ షిప్ లను అందిస్తోంది. ప్రతి డివిజన్ కేంద్రానికి 10 స్కాలర్ షిప్ లు అందుతాయి. అర్హత ఉన్న బాలికలకు సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున అందజేస్తారు. పదో తరగతిలో 60 శాతం మార్కులు సాధించి రెండు సంవత్సరాల పాటు 10 + 2 పద్ధతిలో చదువుతున్న బాలికలు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు.

    ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు, తల్లిదండ్రులు, సంరక్షకుల వార్షికాదాయం లక్ష రూపాయల లోపు ఉండాలి. కుటుంబ ఆదాయం, మార్కుల ఆధారంగా ఈ స్కాలర్ షిప్ కు ఎంపిక ప్రక్రియ జరుగుతుందని తెలుస్తోంది. గ్రాడ్యుయేషన్ కోర్సులలో 55 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు అర్హులని చెప్పవచ్చు. ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.