
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలుస్తోంది. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎక్కువ రాబడులను కోరుకునే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా ఎల్‌ఐసీ ఒక పాలసీని అమలు చేస్తోంది. న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్ పేరుతో ఈ పాలసీని అమలు చేస్తుండగా పిల్లల పేర్లతో ఇన్వెస్ట్ చేసేవాళ్లకు ఈ పాలసీ బెస్ట్ పాలసీ అని చెప్పవచ్చు.
ఈ స్కీమ్ ద్వారా పిల్లలకు 18 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి లక్షల్లో పొందే అవకాశం అయితే ఉంటుంది. అలా వచ్చిన డబ్బును పిల్లల కోసం విద్య, ఇతరత్రా ఖర్చుల కొరకు వినియోగించవచ్చు. ఈ పాలసీ మెచ్యూరిటీ 25 సంవత్సరాలు కాగా దశల వారీగా ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని కూడా పొందవచ్చు. ఈ ఎల్‌ఐసి పాలసీ ద్వారా ప్రాథమిక మొత్తంలో 18 సంవత్సరాల వయస్సు వచ్చిన సమయంలో 20 శాతం, 20 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు 20 శాతం పొందవచ్చు.
22 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు మరో 20 శాతం మెచ్యూరిటీ సమయంలో మిగిలిన 40 శాతం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా మెచ్యూరిటీ మొత్తంతో పాటు బోనస్ ను కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది. 12 సంవత్సరాల లోపు పిల్లలకు 10,000 రూపాయల భరోసాతో పాలసీని తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రీమియం మినహాయింపుకు సంబంధించిన ఆప్షన్ కూడా ఈ పాలసీ ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ పాలసీ తీసుకోవడానికి తల్లిదండ్రులు, పిల్లల ఆధార్ కార్డు అడ్రెస్ ప్రూఫ్, పాన్ కార్డ్ ఫోటోకాపీ, పాలసీ తీసుకునే వ్యక్తి మెడికల్ హిస్టరీ ధృవపత్రాలు, ఎల్‌ఐసీ శాఖ నుండి ఫారమ్ ను తీసుకొని అవసరమైన ధృవపత్రాలను జత చేయాల్సి ఉంటుంది.