https://oktelugu.com/

Lic Loan: హోమ్ లోన్ తీసుకునే వాళ్లకు ఎల్‌ఐసీ శుభవార్త.. తక్కువ వడ్డీకే రుణం ?

Lic Loan: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్ తీసుకోవాలని భావించే వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. ప్రాపర్టీ లోన్స్, టాప్ అప్ లోన్స్ తో పాటు హోమ్ లోన్ పొందే అవకాశాన్ని ఎల్‌ఐసీ అందిస్తోంది. కామన్ సర్వీస్ సెంటర్‌ ద్వారా అప్లికేషన్ ఫామ్ ను సమర్పించి హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రస్తుతం 6.7 శాతం వడ్డీరేటుతో హోమ్ లోన్ అందిస్తోంది. 6.7 […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 5, 2022 / 10:27 AM IST
    Follow us on

    Lic Loan: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్ తీసుకోవాలని భావించే వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. ప్రాపర్టీ లోన్స్, టాప్ అప్ లోన్స్ తో పాటు హోమ్ లోన్ పొందే అవకాశాన్ని ఎల్‌ఐసీ అందిస్తోంది. కామన్ సర్వీస్ సెంటర్‌ ద్వారా అప్లికేషన్ ఫామ్ ను సమర్పించి హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రస్తుతం 6.7 శాతం వడ్డీరేటుతో హోమ్ లోన్ అందిస్తోంది.

    6.7 శాతం వడ్డీరేటుకు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ద్వారా హోమ్ లోన్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే క్రెడిట్ స్కోర్ బాగున్న వాళ్లు మాత్రమే తక్కువ వడ్డీరేటుకు రుణాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. క్రెడిట్ స్కోర్ ను పడిపోకుండా చేయడం ద్వారా ఈ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా కామన్ సర్వీస్ సెంటర్లు ఏర్పాటు అయ్యాయి.

    డెవలప్‌మెంట్ కోర్సులు, బీ2సీ సర్వీసులు, ఇతర సర్వీసులను కూడా ఎల్ఐసీ ద్వారా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కామన్ సర్వీస్ సెంటర్లతో బాగస్వామ్యం ద్వారా వేగంగా రుణాలను అందించడం సాధ్యమవుతుందని ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ చెబుతున్నారు. పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఇతర డాక్యుమెంట్లను అందించడం ద్వారా హోమ్ లోన్ ను పొందవచ్చు.

    ఎల్‌ఐసీ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజలకు భారీస్థాయిలో ప్రయోజనం చేకూరుతోంది. తక్కువ వడ్డీకే రుణాలను తీసుకోవాలని భావించే వాళ్లకు ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఇచ్చే లోన్ వల్ల ప్రయోజనం చేకూరనుంది. ఇంటిపై రుణం తీసుకోవాలని అనుకునే వాళ్లు వెంటనే ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.