Kia Sonet Facelift: ఈ కారు ఫీచర్స్, ధర గురించి తెలిస్తే ఫిదా అవుతారు..

దక్షిణ కొరియా కంపెనీకి చెందిన కియా కారు దేశంలో ఏడాదికేడాది సేల్స్ ను పెంచుకుంటోంది. ఈ ఏడాదిలో త్వరలో ఎస్ యూవీలల్లో ఒకటైన సోనెట్ ఫేస్ లిఫ్ట్ ను అందుబాటులోకి తేనుంది.

Written By: Srinivas, Updated On : January 4, 2024 5:00 pm

Kia Sonet Facelift

Follow us on

Kia Sonet Facelift: కారు కొనాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఏ కారు కొనాలి? కారులో ఏం చూడాలి? అనేది చాలా మందికి అయోమయంగానే ఉంటుంది. కానీ ఎక్కువ మంది కారు ఫీచర్స్ ఎలా ఉన్నాయో ముందుగా తెలుసుకుంటారు. ఎందుకంటే వారి అవసరాలకు తగిన విధంగా ఫీచర్స్ ఉన్నాయా? లేవా? అనేది ప్రధానం. వినియోగదారులకు అనుగుణంగానే కార్ల కంపెనీలు ఫీచర్స్ ను అమర్చుతున్నాయి. కొత్త కొత్త ఫీచర్స్ తో కొన్ని కంపెనీలు ఆకట్టుకుంటూ సేల్స్ ను పెంచుకుంటున్నాయి. తాజాగా ఓ కంపెనీ సెట్ చేసిన ఫీచర్స్ గురించి తెలిసి కారు ప్రియులు షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆదేం కారు? అందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?

దక్షిణ కొరియా కంపెనీకి చెందిన కియా కారు దేశంలో ఏడాదికేడాది సేల్స్ ను పెంచుకుంటోంది. ఈ ఏడాదిలో త్వరలో ఎస్ యూవీలల్లో ఒకటైన సోనెట్ ఫేస్ లిఫ్ట్ ను అందుబాటులోకి తేనుంది. ఇప్పటికే దీనిని మార్కెట్లో ప్రదర్శించగా ఫీచర్స్ గురించి తెలిసి షాక్ అవుతున్నారు. కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ లో ఫ్రంట్ కొలిజన్, లేన్ కీప్ లసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, హై బీమ్ అసిస్ట్ వంటివి ఉన్నాయి. లైటింగ్ విషయానికొస్తే సౌండ్ ఇన్ఫోటైన్మెంట్ లోని మ్యూజిక్ మారుతుంది.

సోనెట్ ఫేస్ లిఫ్ట్ కు డిస్క్ బ్రేకులను అమర్చారు. దీనికున్న అన్ని చక్రాలు డిస్క్ ను కలిగి ఉంటాయి. ఇవి కారును సురక్షితంగా ఉంచగలుగుతాయి. ఇందులో చల్లటి వాతావరణం ఇచ్చేందుకు ఉండే ఏసీకి రిమోట్ ఇచ్చారు. ఇది క్లైమేట్ ను భట్టి మారుతుండడం విశేషం. కారు స్మార్ట్ కీలో స్పెషల్ ఏర్పాటు చేసిన ఈ ఫీచర్ ఆకట్టుకుంటుంది. సోనెట్ లో బటన్ లతో HVAC పనిచేస్తుంది. అయితే ఒక్కోసారి ఇది పనిచేయదనే వాదనలు వినిపిస్తున్నాయి.

అచ్చం ఇలాంటి ఫీచర్లే ఇప్పటి వరకు టాటా నెక్సాన్ అందించగలిగింది. అయితే ఆ కారుకు పోటీ ఇస్తూ.. మరింత మెరుగులు దిద్దుకున్న సోనెట్ ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఏ కారులో లేని కొన్ని ఫీచర్స్ ను ఇందులో అందించనున్నట్లు కంపనీ ప్రతినిధులు పేర్కంటున్నారు. అయితే ఈ కారు మధ్యతరగతి వినియోగదారులు కొనుగోలు చేసేలా ధరను నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా దీనిని రూ.8 లక్షల వరకు విక్రయించే అవకాశాలున్నట్లు సమాచారం.