Kia PV5 Campervan: కియా కార్లకు భారతదేశంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. దక్షిణ కొరియాకుచెందిన ఈ కంపెనీ భారత్ లో ప్రత్యేకమైన ప్లాంట్ ను ఏర్పాటు చేసి వినియోగదారులకు అనుగుణంగా మోడల్స్ ను మార్కెట్లో ప్రవేశపెడుతోంది. అయితే 2026 కొత్త సంవత్సరంలో ఈ కంపెనీ కొత్తగా Camper పేరుతో టూఇన్ వన్ మోడల్ ను ప్రవేశపెట్టింది. అంటే దీనిని సొంత అవసరాలతో పాటు వాణిజ్య అవసరాలకు కూడా ఉపయోగించుకునేవిధంగా సెట్ చేశారు. అలాగే వీకెంట్ టూర్ తో పాటు కార్వాన్ కోసం ఉపయోగించేందుకు అనుగుణంగా డిజైన్ చేశారు. ఈ కారు ఎలా ఉందంటే?
Kia క్యాంపర్ PV5 పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ వ్యాన్ ఫుడ్ ట్రక్ కు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందులో హైబ్రిడ్ ఇంజిన్ ను చేర్చారు. పెట్రోల్ తో పాటు ఎలక్ట్రిక్ వేరియంట్ లతో పనిచేసే ఇది వేగవంతమైన ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. దీని బాహ్య డిజైన్ ను చూస్తే వెంటనే కొనేయాలని అనిపిస్తుంది. ఎందుకంటే అందంగా ఉండే LED హెడ్ ల్యాంప్స్, ద్రుఢమైన గ్రిల్, పొడవైన హైవే డ్రైవ్ లు ఏరోడైనమిక్ గా పనిచేస్తాయి. ఈ వాహనం పొడవుగా ఉండడంతో ఎలాంటి రోడ్లపైనైనా సులువుగా వెళ్లగలదు. పైన అటాచ్డ్ పరికరాలు అదనపు ప్రయోజనాలను అందిస్తాయి. వెనుకభాగంలో కావాల్సిన వస్తువులను స్టోర్ చేసుకోవచ్చు.
ఇంటీరియర్ లో ఎక్కడా రాజీలేకుండా డిజైన్ చేశారు. ఓవర్ హెడ్ క్యాబినెట్, సీటు కింద కంపార్ట్ మెంట్, మాడ్యులర్ నిల్వ వంటివి సౌకర్యాన్ని కలిగిస్తాయి. సహజంగా, సున్నితంగా ఉండే సీట్స్ ఉండడంతో ఇద్దరు పెద్దలు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. అలాగే వెంటిలేషన్ కూడా బాగుండడంతో స్వచ్ఛమైన వాతావరణాన్ని పొందవచ్చు. డ్రైవర్ కు విశ్రాంతి తీసుకునేందుకు ఆహ్లదకరమైన వాతావరణం ఉంటుంది. కేవలం ప్రయాణం చేయడానికి మాత్రమే కాకుండా విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఇది పనిచేస్తుంది.
ఇందులో స్మార్ట్ టెక్నాలజీ అద్భుతం అనిపిస్తుంది. సెంట్రల్ టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్తో పాటు స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్, నావిగేషన్, సంగీతం, కమ్యూనికేషన్ వంటి యాప్ లకు పూర్తిగా మద్దతు ఇస్తుంది. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఎలాంటి అంతరాయాలు లేకుండా ఫీచర్లు సహాయపడుతాయి. యూఎస్ బీ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు ఆడియో సిస్టమ్ సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్ కీపింగ్ సపోర్ట్ వంటివి సేప్టీని ఇస్తాయి. ఉన్నత కుటుంబాలు రోడ్డుపై విశ్రాంతి తీసుకోవడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ కారు మార్కెట్లో రూ.32 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్ రూ.52 లక్షల వరకు విక్రయిస్తున్నారు. దీనిని రూ. 3,999 ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది.
